నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఉమ్మడి కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, టోర్నమెంట్ స్పాన్సర్ ఎం.బి.టీ. బాబుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తైక్వాండో ఒలింపిక్స్‌లో గుర్తింపు పొందిన క్రీడని, విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. బాలికలు ఆత్మరక్షణ కోసం తైక్వాండో నేర్చుకోవాలని ఎం.బి.టీ. బాబు సూచించారు. ఆదివారం విజేతలకు బహుమతులు అందజేస్తామని రాష్ట్ర కార్యదర్శి ఎల్.టి. చంద్రమౌళి తెలిపారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు, కోచ్‌లు, 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.

నంద్యాలలో తైక్వాండో పోటీలు రాయలసీమ జోనల్ స్థాయి పోటీలు ప్రారంభం