Tuesday, 1 September 2026
  • Home  
  • సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు.. 1600 మంది పోలీసులతో భద్రత
- అనకాపల్లి

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు.. 1600 మంది పోలీసులతో భద్రత

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు 1600 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 03 అదనపు ఎస్పీలు, 09 డీఎస్పీలు, 36 సీఐలు, 90 ఎస్సైలు సహా పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. రోప్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ బలగాలను మోహరిస్తున్నారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ముఖ్య మార్గాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):

పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు 1600 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 03 అదనపు ఎస్పీలు, 09 డీఎస్పీలు, 36 సీఐలు, 90 ఎస్సైలు సహా పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. రోప్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ బలగాలను మోహరిస్తున్నారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ముఖ్య మార్గాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.