పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 26 (చిల్లకూరు)
ఎం.వి. రావు ఫౌండేషన్ సేవలు చిరస్మరణీయమని మచ్చకాల. నందకుమార్ అన్నారు.
చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల దినోత్సవం పురస్కరించుకొని కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ ఆప్టికల్స్ నేత్రవైద్యం నిపుణులు డాక్టర్ రమేష్ నేతృత్వంలో ఉచితనేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ శిబిరాన్ని వల్లిపేడు గ్రామానికి చెందిన ఎం.నందకుమార్ ప్రారంభించారు.
ముందుగా స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వల చేసి వారికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నందకుమార్ మాట్లాడుతూ ప్రతినిత్యం ఎంవి రావు ఫౌండేషన్ సేవలో నిరుపేదలకు అందుతున్నాయని గూడూరు డివిజన్ వ్యాప్తంగా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చిరస్మరణీయమని నందకుమార్ అన్నారు.
ఇప్పటివరకు 11 6 0 0 5 సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరుపేద గుండెల్లో ఎంవీ రావు ఫౌండేషన్ చిరస్మరణీయంగా నిలుస్తుందని తెలిపారు.
దానికి లీలా మోహన్ కృష్ణ సేవలు అనేర్వచనీయమని తెలిపారు.
కోట రమేష్ ఐ కేర్ నేత్ర విద్య నిపుణులు డాక్టర్ వంచివాకర్ రమేష్ ఈ వైద్య శిబిరానికి విచ్చేసిన రోగులకు కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కంటే అద్దాలు అవసరమైన వారికి అత్యంత తక్కువ ధరకు కంటే అద్దాలను అందజేస్తామని తెలిపారు.
ఈ కంటి వైద్య శిబిరంలో ఎక్కువగా కంటే ఆపరేషన్లు అవసరమైన గుర్తించి వారికి నెల్లూరులోని మెడికేర్ ఆసుపత్రి నందు ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఎన్వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కంటి వైద్య శిబిరం లో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి, డాక్టర్ రమేష్, నందకుమార్ జిల్లా పరిషత్ హై స్కూల్, విద్యా కమిటీ చైర్మన్ బండి మురళీకృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.



