లక్ష్మణచందా: కనకాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మంగళవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమా రెడ్డి హాజరై భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడం అభినందనీయమన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకునేలా అధికారులు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మణచందా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండ్ర నరేష్ రెడ్డి, ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, కనకాపూర్ సర్పంచ్ రాజ్యలక్ష్మి రాజు, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ డి. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకేష్, ప్రమోద్, కప్పకంటి మోహన్, మల్లికార్జున్, రమేష్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



