రాజన్న సిరిసిల్ల ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండలం బదనకల్ జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న బుచ్చెల్లి కృతిక ప్రియదర్శిని అండర్-16 షాట్‌పుట్ పోటీల్లో ప్రతిభ చాటింది. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ చిగురు నరేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఆకాంక్షించారు.


