విశ్వ మానవుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి
…. సాహితీ వేత్త నల్లా నరసింహ మూర్తి
అమలాపురం జూలై 29
తెలుగు సాహిత్యంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన రెండవ తెలుగు రచయిత ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి. నారాయణ రెడ్డి అని శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు, కోనసీమ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శి, సీనియర్ తెలుగు లెక్చరర్ నల్లా నరసింహమూర్తి అన్నారు. అమలాపురం పరంజ్యోతి జూనియర్ కళాశాలలో కోనసీమ రచయితల సంఘం, ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మహాకవి డాక్టర్ సి. నారాయణరెడ్డి 95వ జయంతి సభా కార్యక్రమంలో నరసింహమూర్తి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 1962 లో మహానటుడు ఎన్టీఆర్ ఆహ్వానంపై గులేబకావళి కథ సినిమా కు సినీ రచయితగా ఆయన తొలి సినిమాగా చిత్ర రంగంలోకి అడుగు పెట్టారని , ఆ సినిమాలో అన్ని పాటలు అద్భుతంగా హృదయానికి హత్తుకునే విధంగా భావ సౌందర్యంతో రాశారని అన్నారు. ఆయన రచించిన “విశ్వంభర” కావ్యం ఆయనకు ఎంతో కీర్తి తెచ్చిపెట్టిందని విశ్వంభర కావ్యంలో కథానాయకుడు మానవుడు అని, ఈ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించిందని నరసింహా మూర్తి వివరించారు. తెలుగు సాహిత్య లో మధురమైన పదాలతో మానవీయ విలువలతో విశ్వమానవ ప్రేమను పరిమళింప చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి సి.నా.రె అని ఆయన అన్నారు.తెలుగు గజళ్ళ కు మానవీయ దృక్పథాన్ని అనుసంధించ డం లోనూ వచన కవితలో ఇతిహాస కావ్యం విశ్వంభర ను నిర్మించడంలో నూ ఆయనకు ఆయనే సాటి అని నరసింహమూర్తి అన్నారు .సుమారు నాలుగు వేలకు పైగా సినీ పాటలు రాసి రస హృదయాలను ఆకట్టు కున్నార ని ఆయన అన్నారు.
సభకు పరంజ్యోతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్లా. తమ్మేశ్వర రావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ నారాయణరెడ్డి రచించిన విశ్వంభర మహా కావ్యానికి 1988లో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించిందని ,. తరతరాలకు స్ఫూర్తిదాయకం సి.నా.రె సాహిత్య మని ఆయన అన్నారు.
ముఖ్యఅతిథిగా అమలాపురం లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చిక్కాల సతీష్ వచ్చేసి
. తెల్లని పంచెకట్టుతో తెలుగు దనం నింపుకున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ విశ్వంభరుడు సి.నా.రె అని అన్నారు.
వికలాంగుల మహా సంఘటన అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్ మాట్లాడుతూ దక్షిణ భారతం నుండి రాజ్యసభ సభ్యునిగా నియమించబడిన మొట్టమొదటి కవి నారాయణరెడ్డి అని ఆయన అన్నారు. సభలో డాక్టర్ సి.నారాయణరెడ్డి చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ నల్లా తమేశ్వర రావు, చిక్కాల సతీష్, నల్లా నరసింహమూర్తి , నిమ్మకాయల సురేష్ పూలమాలలు వేసి నివాళు లర్పించా రు . విద్యార్థులు పుష్పాలతో సి.నా.రె చిత్రపటానికి నివాళులర్పించారు.
.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పి. కన్యాకుమారి , ఎస్. రామలక్ష్మి, సిహెచ్. విజయ ,కె.వెంకటరమణ, ఎం లక్ష్మీ దుర్గ, యు.ఎన్. సుమన్ రాజు, కె. స్వామి నాయుడు, కె .శ్రీ హరి బాబు పాల్గొన్నారు.


