పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కాటన్ చీరల తయారీ కార్మికులు ఆసాములు కూలి పెంపు కోసం సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగారు సోమవారం అంబా భవాని ఫంక్షన్ హాల్ లో సమ్మెను ప్రారంభించారు కూలి ఒప్పందం ముగిసి 30 నెలలు గడిచిన పెంపు జరగలేదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తెలిపారు కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు



