Wednesday, 30 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

పోషణ్ అభియాన్ కార్యక్రమం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం అంగన్వాడి కేంద్రంలో మంగళవారం పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ పోషణ్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ముత్యాల ప్రమీల బాలరాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది గర్భని స్త్రీలకు మరియు బాలింతలకు 0-6 సంవత్సరాల పిల్లలకు మసిక ఎదుగుదల గురించి మంచి పౌష్టికాహారం ఇవ్వాలని ఆకుకూరలు బాలామృతం తీసుకోవాలని కోరడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

VBG – RAM G పథకం ద్వారా గ్రామసభ ఏర్పాటు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో VBG RAM G పథకం ద్వారా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలో వనరులు మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి అవసరాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను గుర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యాల ప్రమీల బాలరాజు ఉప సర్పంచ్ గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు రగుడు బైపాస్ రోడ్ లోని సభ ప్రణాంగాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు

రాజన్న సిరిసిల్ల

విద్యార్థి అభ్యర్థనకు స్పందించిన కేటీఆర్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని బాబాయి చెరువు తండాకు చెందిన ఐఐటి విద్యార్థి అజ్మీర శరత్ నాయక్ తన చదువు కోసం ల్యాబ్ టాప్ అవసరమని ఎమ్మెల్యే కేటీఆర్ ను కోరారు స్పందించిన కేటీఆర్ తెలంగాణ భవన్లో ల్యాబ్ ట్యాబ్ అందించిన కేటీఆర్ కు కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

ప్రత్యేక పూజలు తీర్థప్రసాదాలు స్వీకరణ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి వారిని మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే హరి శ్రీనివాస్ వేముల వీరేశం విజయ రమణారావు స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అర్చకులు వేద పండితులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు

రాజన్న సిరిసిల్ల

రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు ఆలయ అభివృద్ధి పనులపై ఆయన మాట్లాడారు భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ పనులు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు

రాజన్న సిరిసిల్ల

చిన్నారులకు అక్షరాభ్యాసం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పది ర అంగన్వాడి కేంద్రంలో మంగళవారం రాష్ట్రీయ పోషణ్ మాసం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్వరూప వీర్నపల్లి మండల ప్రత్యేక అధికారి క్రాంతి కుమార్ ఎంపీడీవో శ్రీలేఖ పాల్గొన్నారు నూతనంగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పలక బలపం పట్టి అక్షరాలు నేర్పించారు

రాజన్న సిరిసిల్ల

పెండింగ్ హామీలు అమలు చేయాలి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల పై శ్వేత పత్రం విడుదల చేయాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు వీర్నపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు రైతులు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ హామీలను అమలు చేయాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

BRS ఎక్స్ లో స్పందన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గడ్డ.. కేటీఆర్ అడ్డా అంటూ BRS ఎక్స్ లో టిట్ చేసింది అభివృద్ధి అంటే ఏంటో సిరిసిల్లను చూసి మిగతా నియోజకవర్గం అభివృద్ధి చేయాలని సిరిసిల్లకు చెందిన మహిళ తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ లో చేసిన టి టి కు బి ఆర్ ఎస్ ఈ విధంగా స్పందించింది

రాజన్న సిరిసిల్ల

రిజర్వేషన్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓ బి సి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయము జరుగుతుందని పేర్కొన్నారు బీసీ వర్గాల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.