Thursday, 3 September 2026
  • Home  
  • 31 మంది సర్వేయర్ల లైసెన్సులు రద్దు అన్యాయం: బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష మండిపాటు
- పెద్దపల్లి

31 మంది సర్వేయర్ల లైసెన్సులు రద్దు అన్యాయం: బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష మండిపాటు

పెద్దపల్లి, ఆగస్టు 31: పెద్దపల్లి జిల్లాలో 31 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల లైసెన్సులను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం చేపట్టిన పోరాటానికి బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. పూర్తిస్థాయి విచారణ జరపకుండా, బాధితుల వాదన వినకుండా రాత్రికి రాత్రే లైసెన్సులు రద్దు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర అన్యాయమని ఆమె మండిపడ్డారు. తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సర్వేయర్ల సమస్యలపై నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం పెద్దపల్లి జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేయడం వెనుక ఉన్న అంతరార్థమేమిటని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల 31 కుటుంబాలు రోడ్డున పడి, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, సర్వేయర్ల లైసెన్సుల రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, బాధిత సర్వేయర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరవింద్, రాష్ట్ర సలహాదారు గోవర్ధన్, జిల్లా నాయకులు తిరుపతి, సురేష్, గోపి, అభిలాష్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దపల్లి, ఆగస్టు 31:
పెద్దపల్లి జిల్లాలో 31 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల లైసెన్సులను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం చేపట్టిన పోరాటానికి బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. పూర్తిస్థాయి విచారణ జరపకుండా, బాధితుల వాదన వినకుండా రాత్రికి రాత్రే లైసెన్సులు రద్దు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర అన్యాయమని ఆమె మండిపడ్డారు. తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సర్వేయర్ల సమస్యలపై నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం పెద్దపల్లి జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేయడం వెనుక ఉన్న అంతరార్థమేమిటని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల 31 కుటుంబాలు రోడ్డున పడి, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, సర్వేయర్ల లైసెన్సుల రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, బాధిత సర్వేయర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరవింద్, రాష్ట్ర సలహాదారు గోవర్ధన్, జిల్లా నాయకులు తిరుపతి, సురేష్, గోపి, అభిలాష్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.