దిగ్విజయంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శ్రీ సాయి గణేష్ వినాయక ఉత్సవాలు
భూపాలపల్లి: హనుమాన్ నగర్ ఫేజ్-2 కాలనీలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్న శ్రీ సాయి గణేష్ వినాయక ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
దిగ్విజయంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, 2026 శ్రీ సాయి గణేష్ వినాయక కమిటీ అధ్యక్షులు శ్రీ గడ్డం గట్టన్న ఆధ్వర్యంలో గణనాథుడు కొలువుదీరారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుని ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సంవత్సరం వినాయక విగ్రహాన్ని శ్రీమతి శ్రీ అల్లి ధనలక్ష్మి, చేరాలు దంపతులు అందించగా, కలశం దాత పున్నమి స్వాతి, లడ్డూ దాతలు శ్రీమతి శ్రీ మందల రజిత, శ్రీనివాస్, టింకులు భక్తిశ్రద్ధలతో తమ వంతు సహకారం అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు శ్రీ నగునూరి రజనీకాంత్ గౌడ్ హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హనుమాన్ నగర్ ఫేజ్-2 కాలనీలో 20 సంవత్సరాలుగా నిరంతరంగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ, భక్తి భావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని చాటుతున్న కమిటీ సభ్యులను అభినందించారు.
కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు. శ్రీ సాయి గణేష్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

