Monday, 22 June 2026
  • Home  
  • ఆత్మకూరులో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో లంచ్ అవర్ కార్యక్రమం.. డీఈఈకి వినతిపత్రం అందజేత ఆత్మకూరు, జూన్ 22 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఆత్మకూరు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద లంచ్ అవర్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, ఉద్యోగులు ముందుగా ఫ్లెక్సీలు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీగా ఆత్మకూరు విద్యుత్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదుట తమ సమస్యలను వివరిస్తూ నినాదాలు చేసి నిరసన తెలిపారు.విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి యూనియన్ల ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నామని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం స్ట్రగుల్ కమిటీ యూనియన్ సభ్యులు ఆత్మకూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) భానునాయక్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఈఈ భానునాయక్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగం ప్రజలకు అత్యంత కీలకమైన సేవలను అందిస్తున్నప్పటికీ, ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిబ్బంది కొరత, ఉద్యోగ సంబంధిత సమస్యలు, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో తమ సమస్యలను వివరించినప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం లభించకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూఈఈయూ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండమూరు హజరతయ్య, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జీ.వీ. శివప్రసాద్, ఆత్మకూరు డివిజన్ కార్యదర్శి విజయరామిరెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, యూఈసీడబ్ల్యూఈ యూనియన్ డివిజన్ కార్యదర్శి జి. శ్రీనివాసులు పాల్గొన్నారు.అలాగే యూనియన్ నాయకులు షేక్ అలీ, చెంచయ్య, రమణయ్య, పెంచలరావు, బాబు, హరి, చిన్నబాబు తదితరులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో లంచ్ అవర్ కార్యక్రమం.. డీఈఈకి వినతిపత్రం అందజేత

ఆత్మకూరు, జూన్ 22 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఆత్మకూరు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద లంచ్ అవర్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, ఉద్యోగులు ముందుగా ఫ్లెక్సీలు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీగా ఆత్మకూరు విద్యుత్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదుట తమ సమస్యలను వివరిస్తూ నినాదాలు చేసి నిరసన తెలిపారు.విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి యూనియన్ల ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నామని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం స్ట్రగుల్ కమిటీ యూనియన్ సభ్యులు ఆత్మకూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) భానునాయక్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఈఈ భానునాయక్ వారికి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగం ప్రజలకు అత్యంత కీలకమైన సేవలను అందిస్తున్నప్పటికీ, ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిబ్బంది కొరత, ఉద్యోగ సంబంధిత సమస్యలు, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో తమ సమస్యలను వివరించినప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం లభించకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూఈఈయూ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండమూరు హజరతయ్య, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జీ.వీ. శివప్రసాద్, ఆత్మకూరు డివిజన్ కార్యదర్శి విజయరామిరెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, యూఈసీడబ్ల్యూఈ యూనియన్ డివిజన్ కార్యదర్శి జి. శ్రీనివాసులు పాల్గొన్నారు.అలాగే యూనియన్ నాయకులు షేక్ అలీ, చెంచయ్య, రమణయ్య, పెంచలరావు, బాబు, హరి, చిన్నబాబు తదితరులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.