నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్సార్సీపీ నాయకులు
సోమశేఖర్–శివరామేశ్వరి దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
వేముల (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 19:
వేముల గుట్టపై శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో బుధవారం జరిగిన వివాహ వేడుకల్లో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కోకటం వెంకట బయపురెడ్డి పాల్గొని నూతన వధూవరులు మర్రిబోయిన రామకృష్ణ కుమారుడు సోమశేఖర్–శివరామేశ్వరి దంపతులను ఆశీర్వదించారు.
వైఎస్సార్సీపీ నాయకులు మర్రిబోయిన రామకృష్ణ ఆహ్వానం మేరకు ఆలయానికి చేరుకున్న వారు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం నూతన వధూవరులను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాగేళ్ల సాంబశివారెడ్డి, కోకటం వెంకట బయపురెడ్డి మాట్లాడుతూ నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పరస్పర అవగాహనతో కొత్త జీవితంలో ముందుకు సాగుతూ కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కోకటం వెంకట బయపురెడ్డి, పీసీబీ మాజీ డైరెక్టర్ మరకా శివకృష్ణారెడ్డి, చల్లా వెంకటనారాయణ తదితరులు హాజరుకావడంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వారికి సాదర స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మర్రిబోయిన శివప్రసాద్, రాజశేఖర్, చంద్రశేఖర్, శివ, గండి నాగభూషణం, గండి నారాయణస్వామి, ఎర్రగొర్ల పుల్లయ్య, నారుబోయిన గంగాధర యాదవ్, కోమెర రాములయ్య, సాకే నాగప్ప తదితర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.



