తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా బుధవారం కున్సి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మేకలి సురేష్, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పరి రమేష్, జీపీఓ గీత, బీజేపీ మండల అధ్యక్షుడు నల్లే నరసప్ప, కాంగ్రెస్ నాయకులు నల్లే శ్రీనివాస్, తంగిడి సుదర్శన్, సుగప్ప, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.



