డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కాట్రేనికోన మండలం చెయ్యెరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నంద్యాల వెంకటేశ్వరరావు మరణించారు. నంద్యాల వెంకటేశ్వరరావు మరణానికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి చవటపల్లి నాగభూషణం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెయ్యెరు రామలింగేశ్వర ఆక్వా అసోసియేషన్ అధ్యక్షుడిగా తాను వ్యవహరించే వాడినని, అనంతరం జిల్లా కమిటీకి బాధ్యతలు వహించడంతో అప్పటినుండి ఇప్పటివరకు అసోసియేషన్ అధ్యక్షులుగా నంద్యాల వెంకటేశ్వరావు క్రియాశీలకంగా పనిచేసి, రైతు కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు తనవంతుగా తనదైన శైలిలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా సర్వీసెలు అన్నిటికి కూడా సబ్సిడీ 1.50 పై వచ్చేలా చేయడం అభినందనీయమన్నారు. అటువంటి నిస్వార్థమైన మంచితనం గల వ్యక్తి అకాలమరణం చెందడం అక్వా రైతులకి చాలా లోటు అని తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గ్రామములో సంఘం తరుపున, స్టేట్ అక్వా అసోసియేషన్ సెక్రటరీ తరపున సంతాపం తెలియచేస్తూ , మరియు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నంద్యాల వెంకటేశ్వరరావు మరణానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చవటపల్లి నాగభూషణం