Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

స్నేహబంధం చాటుకున్న 2004–05 బ్యాచ్.. మిత్రుడి కుటుంబానికి ఆపన్నహస్తం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్నేహబంధం చాటుకున్న 2004–05 బ్యాచ్.. మిత్రుడి కుటుంబానికి ఆపన్నహస్తం

తోటి మిత్రుడి కుటుంబానికి అండగా పదో తరగతి స్నేహితులు

స్నేహం అంటే ఇదే.. అకాల మిత్రుడి కుటుంబానికి రూ.60 వేల చేయూత

ఏళ్లనాటి స్నేహానికి చిరునామా.. శివకుమార్ కుటుంబానికి మిత్రుల చేయూత

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పదో తరగతి స్నేహితులు..

యాచారం: కొత్తపల్లి గ్రామపంచాయతీ పదో వార్డు సభ్యుడు పోలే శివకుమార్ అకాల మరణంతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి 2004–05 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన క్లాస్‌మేట్స్ అండగా నిలిచారు. బుధవారం శివకుమార్ కుటుంబాన్ని పరామర్శించిన స్నేహితులు రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

తోటి మిత్రుడు అకాల మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సమయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా కొంత భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మొరుగు రమేష్, సంఘం రాజు, దంతుక రమేష్, గండికోట శ్రీనివాస్, రుద్రపల్లి బాలు, తాండ్ర మహేష్, జోగు పాండు, వరకుప్పల మహేష్, అండేకార్ భాష, ఆలూరి అర్జున్, పాశ్చ శ్రీశైలం, సూదిని వేణుగోపాల్ రెడ్డి, కట్టెల రాజు, గుండెల్లి రమేష్, కంబాలపల్లి శేఖర్, జక్కర్త మధుకర్, మండలి రమేష్, ఆలంపల్లి శివశంకర్‌తో పాటు రేణుక, నిర్మల, అరుణ, బాలమణి, జంగమ్మ, సరస్వతి, విజయ, నాజియా బేగం, నుస్రత్ బేగం పాల్గొన్నారు.
అలాగే గ్రామ సర్పంచ్ చిక్కుడు వెన్నెల శేఖర్, ఉపసర్పంచ్ కాలే అనిత రమేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని శివకుమార్ కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు.

స్నేహబంధం చాటుకున్న 2004–05 బ్యాచ్.. మిత్రుడి కుటుంబానికి ఆపన్నహస్తం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *