Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: బ్రేకింగ్ న్యూస్

ప్రకాశం

పామూరు ఉప ఎంపీపీ పదవి జనసేనకు!

కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండల ఉప ఎంపీపీ పదవిని జనసేనకు కేటాయించే అంశంపై కూటమి నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పదవిని జనసేనకు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేకు సమాచారం అందినట్లు కూటమి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. జనసేనకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థి బీసీ పిరికి బలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం చర్చనీయాంశంగా మారింది. పామూరు పట్టణంలో బలిజ సామాజికవర్గానికి మంచి పట్టుండటం, మండలంలో జనసేనకు ఒక్క ఎంపీటీసీ అభ్యర్థి మాత్రమే ఉండటం ఆయనకు అనుకూల అంశాలుగా భావిస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఉప ఎంపీపీ పదవి కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రకాశం

ఎంపీ మాగుంటను మర్యాదపూర్వకంగా కలిసిన ఆకుపాటి వెంకటేష్

పామూరు, అక్టోబర్ 25(పున్నమి ప్రతినిధి): ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ తన మిత్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి జనసేన పార్టీ పీఓసీ మాదాసు రమేష్, జిల్లా కేఆర్ కన్వీనర్ కొంకల రామ్మోహన్, తమ్మిశెట్టి రవీంద్ర, నూగుల కోటేశ్వరరావు, తాటిపత్రి మాల్యాద్రి, లక్కనబోయిన చిరు, సయ్యద్ జిలాని, గిన్నల హర్ష, కోమటిగుంట్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన దారపనేని చంద్రశేఖర్

పామూరు: విజయదశమి పండుగను పురస్కరించుకుని కనిగిరి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన పవిత్రమైన రోజుగా ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని తెలిపారు. జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకోవడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. కనిగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని దారపనేని చంద్రశేఖర్ ఆకాంక్షించారు.

ప్రకాశం

కనిగిరి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి అచ్చాల తిరుపతమ్మ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి, దారపనేని

కనిగిరి నియోజకవర్గం కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీలు చొరవతో పనిచేస్తూ, పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్న అచ్చాల రవి సతీమణి అచ్చాల తిరుపతమ్మ నామినేషన్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి పాల్గొని అచ్చాల తిరుపతమ్మ కు అభినందనలు తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ షరీఫ్, జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బీరం వెంకటేశ్వర రెడ్డి, బొట్టు శీను, తూర్పు కోడిగుడ్లపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్,బైరెడ్డి జస్వంత్ రెడ్డి, పామూరు టిడిపి యువనేత యాదాల సాయికిరణ్, తుమ్మ ఆంజనేయ రెడ్డి, బోడవాడ కొండారెడ్డి,యర సింగ్ రాయుడు, మట్లే రాహుల్ యాదవ్, తిరివీధి చంద్ర, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారీగా పాల్గొన్నారు.

ప్రకాశం

పామూరు రెండో ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి గాలి వెంకటేశ్వర్లు పోటీ

-ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో విజయం సాధిస్తా.. గాలి వెంకటేశ్వర్లు పామూరు: పామూరు మండల రెండో ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా గాలి వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలే తనకు కొండంత బలమని అన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి, అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయడానికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఆదరించి, జనసేన పార్టీ అభ్యర్థిగా తన విజయానికి సహకరించాలని పామూరు రెండో ఎంపీటీసీ పరిధిలోని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు.

ప్రకాశం

తూర్పు కోడిగుడ్లపాడు సర్పంచ్ అభ్యర్థిపై ఉగ్ర నిర్ణయమే శిరోధార్యం

బీసీ మహిళకు రిజర్వు కావడంతో జంగాలపల్లి గ్రామస్తులతో దారపనేని సమీక్ష పామూరు: తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో జంగాలపల్లి గ్రామస్తులతో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతున్న మానం మల్లికార్జునరావు, బొడ్డు వెంకటేశ్వరరావు తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయన నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని దారపనేని పేర్కొన్నారు. ఇద్దరూ తమ కుటుంబ సభ్యులేనని, ఎమ్మెల్యే ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా అందరం ఐక్యంగా పనిచేసి గెలిపిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్, మిరియం సుబ్బరాయుడు, తిరివీధి చంద్ర, మక్కా నాగరాజు, బొడ్డు రవి, బొడ్డు దానమయ్య, బొడ్డు సుధాకర్, చెనికల మల్లికార్జున, బొడ్డు పెద్దదానమయ్య, బొడ్డు వినోద్, బొడ్డు తిరుపతిరావు, నాగం నాగరాజు, మానం వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం

పామూరు ఐదో ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నేత వెంకటరెడ్డి పోటీకి సిద్ధం

గోపాలపురం అభివృద్ధే లక్ష్యమంటున్న మండల తెదేపా ఉపాధ్యక్షుడు పామూరు: పామూరు పంచాయతీ పరిధిలోని గోపాలపురం ఐదో ప్రాదేశిక ఎంపీటీసీ స్థానానికి పామూరు మండల టీడీపీ ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి పోటీ చేయనున్నట్లు సమాచారం. పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న ఆయనకు అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలియడంతో గ్రామంలో టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అవకాశం కల్పిస్తే 16, 17, 18వ వార్డుల ప్రజల సహకారంతో గోపాలపురం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ప్రకాశం

పామూరు రెండో ఎంపీటీసీ అభ్యర్థిగా ఓగూరి నరసింహారావు

రెండుసార్లు వార్డు మెంబర్‌గా విజయం.. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర గెలుపుకు కృషి పామూరు: పామూరు రెండో ఎంపీటీసీ బీసీ జనరల్ స్థానం నుంచి ఓగూరి నరసింహారావు పోటీకి సిద్ధమవుతున్నారు. అంకాలమ్మ వీధి నుంచి రెండుసార్లు వార్డు మెంబర్‌గా విజయం సాధించిన ఆయనకు స్థానిక రాజకీయాల్లో అనుభవంతో పాటు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన తల్లి ఓగూరు బుజ్జమ్మ సైతం వార్డు మెంబర్‌గా విజయం సాధించారు. 2024 శాసనసభ ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గెలుపు కోసం 279వ బూత్‌లో ఓగూరి నరసింహారావు కృషి చేసి అత్యధిక మెజార్టీ సాధించడంలో ముఖ్య భూమిక వహించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా తనవంతు సహకారం అందించేందుకు ముందుండటం ఆయన ప్రత్యేకతగా అనుచరులు పేర్కొంటున్నారు. వడ్డెరపాలెం ప్రజలతో పాటు కాపు, ఆర్యవైశ్య, ముస్లిం మైనార్టీ వర్గాల వారితోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో వార్డు మెంబర్‌గా పనిచేసిన అనుభవంతో స్థానిక సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు, ఎంపీటీసీ పరిధి అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఓగూరి నరసింహారావు ముందుకు సాగుతున్నారు.

ప్రకాశం

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ప్రజాసేవలో సోమిశెట్టి నారాయణ

వార్డు మెంబర్ గా మాజీ సర్పంచ్ సోమిశెట్టి పోటీ- పామూరు: మార్కాపురం జిల్లా, కనిగిరి నియోజకవర్గంలోని పామూరు గ్రామపంచాయతీ 9వ వార్డు సభ్యుడిగా మాజీ సర్పంచి సోమిశెట్టి నారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి కూడా గతంలో సర్పంచిగా పనిచేసి గ్రామ ప్రజలకు సేవలందించారు. తండ్రి మరణానంతరం సోమిశెట్టి నారాయణ సైతం సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో సర్పంచిగా పనిచేసిన అనుభవంతో వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సోమిశెట్టి నారాయణ తెలిపారు. 9వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ, వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.

ప్రకాశం

టీడీపీ బలోపేతానికి కుటుంబ సాధికారిక సభ్యులు కృషి చేయాలి:బొల్లా నరసింహారావు

పామూరు: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కుటుంబ సాధికారిక సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పామూరు మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు పిలుపునిచ్చారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పామూరు పట్టణంలోని శేషమహల్ ప్రాంగణంలో రెండో ఎంపీటీసీ ప్రాదేశిక పరిధి, 5, 6, 7, 8 వార్డులకు చెందిన కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లా నరసింహారావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు నాయకుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ విజయానికి కుటుంబ సాధికారిక సభ్యుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలపర్తి వెంకటేశ్వర్లు, మాజీ పట్టణ సర్పంచ్ సోమిశెట్టి వెంకటనారాయణ, మాజీ పట్టణ ఉప సర్పంచ్ యాదల సాయికిరణ్, క్లస్టర్ ఇన్‌చార్జులు ఆడుసుమల్లి ప్రభాకర్‌రావు, గుంటుపల్లి శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డి, బీజేపీ నాయకులు కొండిశెట్టి రమణయ్య, ఇమ్మడిశెట్టి శ్రీను, జనసేన నాయకులు వై. రహీముల్లా, దర్శి ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆకుపాటి వెంకటేష్, వార్డు ఇన్‌చార్జులు నీరుకట్టు రసూల్, గడ్డం తేజ, నర్సింగ్ సాంబశివరావు, ఈర్ల సత్యంతో పాటు మండల, పట్టణ టీడీపీ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కుటుంబ సాధికారిక సభ్యులు పాల్గొన్నారు.