Sunday, 27 September 2026

Tag: బ్రేకింగ్ న్యూస్

రంగారెడ్డి

కొండా సురేఖకు బిగ్ షాక్! మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

కొండా సురేఖకు బిగ్ షాక్! మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం పున్నమి న్యూస్ 03 తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం.. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే ప్రక్రియకు గవర్నర్ ఆమోదం లభించింది. సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు లేఖపై గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తాజా సమాచారం. దీంతో కొండా సురేఖ మంత్రివర్గం నుంచి తొలగింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత వివాదానికి తెరపడినట్లైంది. పార్టీ క్రమశిక్షణ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫారసుల నేపథ్యంలో అధిష్ఠానం చర్యలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్‌కు సిఫారసు చేశారు. సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై అధిష్ఠానం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో సురేఖపై చర్యలకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌లో పెరిగిన రాజకీయ వేడి.. సురేఖ తదుపరి అడుగు ఏమిటి? తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఉత్కంఠ!

రంగారెడ్డి

తుక్కుగూడ నర్సు కుటుంబానికి కేటీఆర్ భరోసా

తుక్కుగూడ నర్సు కుటుంబానికి కేటీఆర్ భరోసా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ.. ఫోన్‌లో పరామర్శ ముల్కలపల్లి: తుక్కుగూడలో దారుణ హత్యాచారానికి గురైన నర్సు కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన బాధిత యువతి కుటుంబ సభ్యులను కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయం అందించి, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తమ వంతు సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు. Uploaded Video:

రంగారెడ్డి

తుక్కుగూడ నర్సు హత్యపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్!

తుక్కుగూడ నర్సు హత్యపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్! సుమోటోగా విచారణకు ఆదేశం.. 7 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలి తుక్కుగూడ: నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. ఘటనపై తెలంగాణ డీజీపీకి NCW చైర్‌పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. వేగవంతమైన దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులను ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పరిణామాలు, నిందితుడి పూర్వ నేరచరిత్రపై సమగ్రంగా ఆరా తీయాలని సూచించింది. అదేవిధంగా నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని NCW ఆదేశించింది. కేసు దర్యాప్తు పురోగతిపై ఏడు రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ పోలీసులను కోరింది. నర్సు హత్య కేసుపై కేంద్ర స్థాయిలో నిఘా ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ నేర విచారణ, నిందితుడిపై చర్యలు, కేసు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో తుక్కుగూడ నర్సు హత్య కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రంగారెడ్డి

తుక్కుగూడ నర్సు హత్యపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్!

తుక్కుగూడ నర్సు హత్యపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్! సుమోటోగా విచారణకు ఆదేశం.. 7 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలి తుక్కుగూడ: నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. ఘటనపై తెలంగాణ డీజీపీకి NCW చైర్‌పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. వేగవంతమైన దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులను ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పరిణామాలు, నిందితుడి పూర్వ నేరచరిత్రపై సమగ్రంగా ఆరా తీయాలని సూచించింది. అదేవిధంగా నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని NCW ఆదేశించింది. కేసు దర్యాప్తు పురోగతిపై ఏడు రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ పోలీసులను కోరింది. నర్సు హత్య కేసుపై కేంద్ర స్థాయిలో నిఘా ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ నేర విచారణ, నిందితుడిపై చర్యలు, కేసు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో తుక్కుగూడ నర్సు హత్య కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రంగారెడ్డి

మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు

మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు తుర్కయాంజాల్‌లో వర్ధంతి కార్యక్రమం.. ఇబ్రహీంపట్నంలో నిరుపేదలకు రేషన్ కిట్ల పంపిణీ తుర్కయాంజాల్, సెప్టెంబర్ 2: మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు ఆయనను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయని కొనియాడారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించి, అవసరమైన నిరుపేదలకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. మహానేత వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ పేదలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు, జ్యోతి ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. లిక్కి వెంకట్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి

రంగారెడ్డి

అక్రమ నిర్మాణమా..? అధికారుల నిర్లక్ష్యమా..?

కళ్లముందే భారీ షెడ్ నిర్మాణం.. అధికారుల మౌనం! అనుమతులు ఉన్నాయా? లేవా? తేల్చాల్సిన బాధ్యత ఎవరిది? ఫిర్యాదులు చేసినా స్పందన కరువు.. నిర్మాణం తుది దశకు చేరినా పట్టించుకోరంటున్న స్థానికులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న నిబంధనలు.. క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రశ్నలు హయత్‌నగర్: ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని హయత్‌నగర్ సాయిబాబా గుడి వెనుక వైపు భారీ షెడ్ నిర్మాణం జరుగుతున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేకులు, ఇనుప సామగ్రితో నిర్మిస్తున్న ఈ భారీ షెడ్ పనులు ఇప్పటికే దాదాపు తుది దశకు చేరుకున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? లేక నిబంధనలను పక్కన పెట్టి నిర్మాణం కొనసాగుతున్నదా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నిర్మాణ పనులు ప్రారంభమైన సమయంలోనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, నిర్మాణదారులు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే నిర్మాణం బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం కనిపిస్తున్నా.. చర్యలు కనిపించవా? పట్టణ ప్రాంతాల్లో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే సంబంధిత నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణ స్వరూపం, స్థల వినియోగం, భవన అనుమతులు, ఫీజులు, పన్నులు తదితర అంశాలను సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. కానీ హయత్‌నగర్‌లోని సదరు ప్రాంతంలో భారీ స్థాయిలో షెడ్ నిర్మాణం కొనసాగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నది స్థానికుల ప్రశ్న. నిర్మాణం ప్రారంభ దశలోనే అధికారులు రంగంలోకి దిగితే నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు వచ్చిన తర్వాత కూడా చర్యలు లేకపోవడం వల్ల అధికారుల పర్యవేక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఫిర్యాదులు చేసినా.. స్పందన ఎక్కడ? సదరు నిర్మాణంపై స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. ఫిర్యాదులు అందిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు తగిన స్పందన కనిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు నమోదు చేసుకోవడం మాత్రమే కాకుండా వాటిపై వాస్తవ పరిస్థితిని పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఫిర్యాదులు నిజమైతే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో, నిర్మాణానికి అన్ని అనుమతులు ఉంటే వాటి వివరాలను ఎందుకు వెల్లడించడం లేదో అధికారులు స్పష్టం చేయాలని వారు కోరుతున్నారు. చిన్న నిర్మాణాలపై కఠినంగా.. భారీ షెడ్‌పై ఎందుకు వెనుకడుగు? సాధారణ ప్రజలు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టిన సందర్భాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే కారణంతో నోటీసులు జారీ చేయడం, పనులను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటున్న అధికారులు.. భారీ స్థాయిలో షెడ్ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలన్నదే ప్రజల అభిప్రాయమని, చిన్నవారికి ఒక న్యాయం.. పెద్ద నిర్మాణాలకు మరో న్యాయం ఉండకూడదని వారు అంటున్నారు. అయితే సదరు షెడ్‌కు అన్ని అనుమతులు ఉన్నట్లయితే అధికారుల పరిశీలనలో అది స్పష్టమవుతుందని, అనుమతులు లేకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ‘అనుమతులు ఉన్నాయా?’ అన్నదే ప్రధాన ప్రశ్న సదరు స్థలంలో నిర్మిస్తున్న భారీ షెడ్‌కు సంబంధించి నిర్మాణ అనుమతి ఉందా? స్థల వినియోగానికి అనుమతి పొందారా? సంబంధిత మున్సిపల్/పట్టణ ప్రణాళిక నిబంధనలను పాటిస్తున్నారా? నిర్మాణానికి వర్తించే ఇతర శాఖల అనుమతులు తీసుకున్నారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నట్లయితే వాటి ఆధారాలను అధికారులు పరిశీలించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని, అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే వెంటనే పనులను నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతోందా? అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిర్మాణ అనుమతి ఫీజులు, పన్నులు, ఇతర రుసుముల విషయంలో ఆదాయ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన అంశాలను అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి నిర్మాణానికి వర్తించే ఫీజులు, పన్నులు, అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు షెడ్ నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రత్యేక తనిఖీ నిర్వహిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఏమిటి? అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగితే నిర్మాణం పూర్తయిన తర్వాత పరిస్థితిని నియంత్రించడం మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందుకే నిర్మాణం ప్రారంభ దశలోనే అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే షెడ్ నిర్మాణం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నిర్మాణానికి సంబంధించిన పత్రాలు, అనుమతులు, స్థల వినియోగం, పన్నులు, ఫీజులు తదితర అంశాలను పరిశీలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తనిఖీతోనే అసలు విషయం వెలుగులోకి.. సదరు షెడ్ నిర్మాణంపై స్థానికంగా వస్తున్న ఆరోపణలు, అనుమానాలకు తెరపడాలంటే సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా స్థలాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిర్మాణదారుల వద్ద ఉన్న అనుమతి పత్రాలను పరిశీలించి అవి చెల్లుబాటు అవుతున్నాయా? నిర్మాణం అనుమతులకు అనుగుణంగా జరుగుతోందా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలను అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. అధికారుల తనిఖీలో అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నట్లు తేలితే స్థానికుల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. మౌనం వీడుతారా.. చర్యలు తీసుకుంటారా? హయత్‌నగర్‌లోని సదరు భారీ షెడ్ నిర్మాణంపై స్థానికంగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తారా? నిర్మాణానికి అనుమతులు ఉన్నాయో లేదో స్పష్టం చేస్తారా? నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటారా? లేక నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూస్తారా? అనేది ప్రస్తుతం హయత్‌నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

రంగారెడ్డి

మేడిపల్లి నక్కర్త లో గుడి నిర్మించారు.. బోర్‌ను పూడ్చేశారు!

గుడి నిర్మించారు.. బోర్‌ను పూడ్చేశారు! 20–30 ఏళ్లుగా ప్రజల దాహం తీర్చిన బోర్ మోటార్‌కు సమాధి? నక్కర్త పోచమ్మ దేవాలయం వద్ద బోర్ పూడ్చివేతపై గ్రామస్థుల విస్మయం.. అధికారుల సమక్షంలోనే జరిగిందా? మేడిపల్లి నక్కర్త, సెప్టెంబర్ 2: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలోని పోచమ్మ దేవాలయం వద్ద చోటుచేసుకున్న పరిణామం ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. నూతనంగా పోచమ్మ దేవాలయాన్ని నిర్మించిన నేపథ్యంలో, అక్కడ గత 20–30 సంవత్సరాలుగా ప్రజలకు తాగునీటిని అందిస్తూ వచ్చిన బోర్ మోటార్‌ను పూడ్చివేయడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడిన బోర్.. ఇప్పుడు ఎందుకు పూడ్చివేశారు? స్థానికుల కథనం ప్రకారం.. పోచమ్మ దేవాలయం సమీపంలో ఉన్న బోర్ మోటార్ ఎన్నో సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు ఉపయోగపడుతూ వచ్చింది. తాగునీటితో పాటు ఇతర అవసరాలకు కూడా ఆ బోర్ నీటిని వినియోగించుకునేవారని చెబుతున్నారు. అలాంటి బోర్‌ను దేవాలయ నిర్మాణం సందర్భంగా పూడ్చివేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. దేవాలయం వద్దే బోర్ మోటార్ అందుబాటులో ఉంటే భక్తులకు, దేవాలయ నిర్వహణకు, స్థానిక ప్రజలకు వివిధ రకాలుగా ఉపయోగపడేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో దేవాలయానికి వచ్చే భక్తులు, కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలకు నీటి అవసరం ఏర్పడితే ఈ బోర్ ఎంతగానో ఉపయోగపడేదని వారు పేర్కొంటున్నారు. చూస్తూ ఉండిపోయారా..? బోర్ మోటార్ పూడ్చివేత సమయంలో గ్రామ ప్రజాప్రతినిధులు అక్కడే ఉన్నప్పటికీ దీనిపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సర్పంచ్ సుగుణ, ఉపసర్పంచ్ మధుకర్ రెడ్డి, 11వ వార్డు సభ్యుడు మనోహర జంగయ్య, ఇతర వార్డు సభ్యులతో పాటు మాజీ సర్పంచ్ పాచభాష, మాజీ ఉపసర్పంచ్ బోడ కృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బోర్ మోటార్‌ను పూడ్చివేస్తున్న సమయంలోనే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నప్పటికీ దానిని నిలిపివేయడానికి లేదా ప్రత్యామ్నాయ మార్గం చూపించడానికి ఎందుకు ప్రయత్నించలేదనే చర్చ గ్రామంలో జరుగుతోంది. పూజలు.. అదే సమయంలో బోర్‌కు పూడిక? పోచమ్మ దేవాలయం నూతన నిర్మాణం అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఒకవైపు దేవతకు పూజలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఉపయోగపడిన బోర్ మోటార్‌ను పూడ్చివేయడం స్థానికులను విస్మయానికి గురిచేసిందని చెబుతున్నారు. “గుడి వద్ద బోర్ ఉంటే భక్తులకు, గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాంటి నీటి వనరును పూడ్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. బోర్ పూడ్చివేతకు కారణమేంటి? బోర్ మోటార్‌ను పూడ్చివేయడానికి అసలు కారణం ఏమిటి? దేవాలయ నిర్మాణానికి బోర్ అడ్డుగా ఉందా? లేక మరేదైనా సాంకేతిక లేదా పరిపాలనా కారణం ఉందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. బోర్‌ను పూడ్చివేయడానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే, దానికి సంబంధించిన వివరాలను గ్రామపంచాయతీ అధికారులు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే నీటి వనరుల పరిరక్షణ ఎక్కడ? ప్రస్తుతం అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు నెలకొంటున్న సమయంలో, గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రజలకు ఉపయోగపడిన బోర్ మోటార్‌ను పూడ్చివేయడంపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడే నీటి వనరులను పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉందని వారు పేర్కొంటున్నారు. దేవాలయ అభివృద్ధితో పాటు ప్రజల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బోర్‌ను పూడ్చివేయడం వల్ల భవిష్యత్తులో నీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి.. ఈ వ్యవహారంపై సంబంధిత పంచాయతీ, రెవెన్యూ అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్థులు కోరుతున్నారు. బోర్ మోటార్ ఎప్పటి నుంచి వినియోగంలో ఉంది? దానిని పూడ్చివేయడానికి ఎవరి అనుమతి ఉంది? ఎందుకు పూడ్చివేయాల్సి వచ్చింది? పూడ్చివేతకు ముందు ప్రత్యామ్నాయ నీటి వసతి కల్పించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రజల దాహం తీర్చిన బోర్‌కు పూడిక పడటంతో.. “అభివృద్ధి అంటే ఉన్న వనరులను తొలగించడమేనా?” అనే ప్రశ్న ఇప్పుడు మేడిపల్లి నక్కర్త గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. Uploaded Video:

రంగారెడ్డి

సీజ్ చేసినా.. దర్జాగా వైద్యం! తుర్కయంజాల్‌లో నకిలీ వైద్యుల దందా?

సీజ్ చేస్తారు… గంటల్లోనే ఓపెన్ చేస్తారు! దొంగ క్లినిక్ బాగోతం.. అధికారులకే సవాల్! కేసులు పెట్టినా నో ఫికర్.. సీజ్ చేసినా లెక్కచేయని వైనం అర్హత లేని వైద్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా? వైద్యశాఖ పర్యవేక్షణపై స్థానికుల అనుమానాలు తుర్కయంజాల్: అర్హతలు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలపై వైద్యశాఖ అధికారులు గతంలో తనిఖీలు నిర్వహించి పలు క్లినిక్‌లు, ల్యాబ్‌లపై కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్లు సమాచారం. అయితే సీజ్ చేసిన కొన్ని కేంద్రాలు కొద్దికాలానికే తిరిగి తెరుచుకుని యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ డివిజన్ ప్రధాన కూడలిలో స్టేట్ బ్యాంక్ ఎదురుగా ‘రాజర్షి ఇన్ఫర్మరీ’ పేరుతో కొనసాగుతున్న క్లినిక్‌పై గతంలో అధికారులు అనుమతులు, అర్హతలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసి, నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అదే క్లినిక్ తిరిగి కొనసాగుతుండటంపై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. సీజ్ చేసిన కేంద్రం తిరిగి ఎలా ప్రారంభమైంది? అధికారులు తీసుకున్న చర్యలు ఏమయ్యాయి? తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన విషయం సంబంధిత అధికారుల దృష్టికి రాలేదా? అంటూ వారు నిలదీస్తున్నారు. కేసులు పెట్టినా… భయం లేదా? గతంలో కేసులు నమోదు చేసి సీజ్ చేసిన మరికొన్ని క్లినిక్‌లు కూడా తిరిగి తెరుచుకుని వైద్య సేవలు అందిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజ్ చేసిన తర్వాత నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించే వారికి భయం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తే రోగుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలి తుర్కయంజాల్ పరిధిలోని అనుమతులు లేని క్లినిక్‌లు, ల్యాబ్‌లపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో సీజ్ చేసిన కేంద్రాలను తిరిగి పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీజ్ చేసిన క్లినిక్‌లు మళ్లీ ఎలా తెరుచుకుంటున్నాయి? కేసులు నమోదైనా అక్రమ వైద్యం ఎందుకు ఆగడం లేదు? వైద్యశాఖ పర్యవేక్షణ ఎక్కడ? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రకాశం

250 మందికి ఉచిత వైద్యం

-అయ్యలూరివారిపల్లిలో పండుగలా 42వ బృహత్ వైద్య శిబిరం పామూరు, సెప్టెంబర్ 1 ( పున్నమి ప్రతినిధి ): రమణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం సీ.ఎస్‌. పురం మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామంలో నిర్వహించిన 42వ ఉచిత బృహత్ వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 250 మందికి పైగా గ్రామస్థులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా బాహ్య రోగుల విభాగ పరీక్షలు చేయడమే కాకుండా, రక్తపోటు, మధుమేహం వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఔషధాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఆసుపత్రి అధినేత డాక్టర్ పి. మల్లికార్జున్ రెడ్డి సేవా నిరతిని స్థానికులు కొనియాడారు. గ్రామానికి చెందిన సమాన తిరుపతి, సమాన రమణయ్య, సమాన రమేష్, డి. కేశవరావు (గ్రామీణ వైద్యుడు) శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా అరటిపండ్లు, చల్లని మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి ఆయన సామాజిక సేవలను అభినందించారు.

ప్రకాశం

టెట్ సమస్య పరిష్కారానికి ఏపీటీఎఫ్ నిరవధిక ధర్నాను విజయవంతం చేయండి

– పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకుల పిలుపు పామూరు, సెప్టెంబర్ 1 ( పున్నమి ప్రతినిధి ): ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్ పరీక్షల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రేపటి నుండి విద్యాభవన్ ముందు చేపట్టనున్న నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పామూరు మండల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల శ్రీనివాసులు, షేక్ ఖాజా మస్తాన్, జిల్లా కౌన్సిలర్ మచ్చ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం టెట్ నిర్వహణ విధానంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్ (మాన్యువల్) పద్ధతిలో నిర్వహించాలని కోరారు. అలాగే టెట్‌లో ప్రస్తుతం ఉన్న అర్హత మార్కులను తగ్గించి అందరికీ కనీస అర్హత పాస్ మార్కులను 40 శాతంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ మరియు బయోలాజికల్ సైన్స్ (PS, BS) ఉపాధ్యాయులకు వారి వారి సంబంధిత సబ్జెక్టుల్లోనే టెట్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించడం వల్ల ఆయా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా టెట్‌కు సంబంధించిన ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏపీటీఎఫ్ చేపడుతున్న ఈ పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు మద్దతు పలకాలని, రేపటి నుండి విద్యాభవన్ ముందు జరిగే నిరవధిక ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. డిమాండ్లు నెరవేరే వరకు ఏపీటీఎఫ్ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.