అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బొటనీ విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చని వాతావరణం ఎంతో అవసరమని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా విద్యార్థులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. బొటనీ అధ్యాపకులు బి. లచ్చన్న మాట్లాడుతూ పర్యావరణం, మానవ ఆరోగ్యానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

అరకు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత