Saturday, 26 September 2026
  • Home  
  • పల్లె పండుగ 3.0 ఏర్పాట్లను పరిశీలించిన కొట్టే వెంకటేశ్వర్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ 3.0 ఏర్పాట్లను పరిశీలించిన కొట్టే వెంకటేశ్వర్లు

ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం: రామాపురం గ్రామంలో నిర్వహించనున్న “పల్లె పండుగ 3.0” కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ విచ్చేయనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు రామాపురంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, వేదిక, ఇతర సదుపాయాలను పరిశీలించి నిర్వాహకులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆల్లూరి రవీంద్ర, రసూల్ పటాన్, కల్లూరి సురేంద్ర రెడ్డి, రవి కుమార్, పాలిశెట్టి శ్రీనివాసులు, కిరణ్, లికిత్, వెంకట ప్రసాద్, నికిల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏర్పాట్లలో పాల్గొన్నారు.

ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం: రామాపురం గ్రామంలో నిర్వహించనున్న “పల్లె పండుగ 3.0” కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ విచ్చేయనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు రామాపురంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, వేదిక, ఇతర సదుపాయాలను పరిశీలించి నిర్వాహకులతో వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆల్లూరి రవీంద్ర, రసూల్ పటాన్, కల్లూరి సురేంద్ర రెడ్డి, రవి కుమార్, పాలిశెట్టి శ్రీనివాసులు, కిరణ్, లికిత్, వెంకట ప్రసాద్, నికిల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏర్పాట్లలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.