ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగ పంచాయతీలో రూ.4.90 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.4.06 కోట్లతో నిర్మించనున్న ఆర్అండ్బీ రోడ్డుకు శంకుస్థాపన చేయగా, రూ.11 లక్షలతో నిర్మించిన స్మశానవాటిక ప్రహరీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించిన ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రామదాసు కండ్రిగలో రూ.4.90 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగ పంచాయతీలో రూ.4.90 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.4.06 కోట్లతో నిర్మించనున్న ఆర్అండ్బీ రోడ్డుకు శంకుస్థాపన చేయగా, రూ.11 లక్షలతో నిర్మించిన స్మశానవాటిక ప్రహరీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించిన ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

