Tuesday, 1 September 2026
  • Home  
  • టెట్ సమస్య పరిష్కారానికి ఏపీటీఎఫ్ నిరవధిక ధర్నాను విజయవంతం చేయండి
- ప్రకాశం

టెట్ సమస్య పరిష్కారానికి ఏపీటీఎఫ్ నిరవధిక ధర్నాను విజయవంతం చేయండి

– పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకుల పిలుపు పామూరు, సెప్టెంబర్ 1 ( పున్నమి ప్రతినిధి ): ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్ పరీక్షల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రేపటి నుండి విద్యాభవన్ ముందు చేపట్టనున్న నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పామూరు మండల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల శ్రీనివాసులు, షేక్ ఖాజా మస్తాన్, జిల్లా కౌన్సిలర్ మచ్చ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం టెట్ నిర్వహణ విధానంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్ (మాన్యువల్) పద్ధతిలో నిర్వహించాలని కోరారు. అలాగే టెట్‌లో ప్రస్తుతం ఉన్న అర్హత మార్కులను తగ్గించి అందరికీ కనీస అర్హత పాస్ మార్కులను 40 శాతంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ మరియు బయోలాజికల్ సైన్స్ (PS, BS) ఉపాధ్యాయులకు వారి వారి సంబంధిత సబ్జెక్టుల్లోనే టెట్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించడం వల్ల ఆయా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా టెట్‌కు సంబంధించిన ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏపీటీఎఫ్ చేపడుతున్న ఈ పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు మద్దతు పలకాలని, రేపటి నుండి విద్యాభవన్ ముందు జరిగే నిరవధిక ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. డిమాండ్లు నెరవేరే వరకు ఏపీటీఎఫ్ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

– పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకుల పిలుపు
పామూరు, సెప్టెంబర్ 1 ( పున్నమి ప్రతినిధి ): ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్ పరీక్షల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రేపటి నుండి విద్యాభవన్ ముందు చేపట్టనున్న నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పామూరు మండల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల శ్రీనివాసులు, షేక్ ఖాజా మస్తాన్, జిల్లా కౌన్సిలర్ మచ్చ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం టెట్ నిర్వహణ విధానంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్ (మాన్యువల్) పద్ధతిలో నిర్వహించాలని కోరారు.
అలాగే టెట్‌లో ప్రస్తుతం ఉన్న అర్హత మార్కులను తగ్గించి అందరికీ కనీస అర్హత పాస్ మార్కులను 40 శాతంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ మరియు బయోలాజికల్ సైన్స్ (PS, BS) ఉపాధ్యాయులకు వారి వారి సంబంధిత సబ్జెక్టుల్లోనే టెట్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించడం వల్ల ఆయా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా టెట్‌కు సంబంధించిన ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని వారు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏపీటీఎఫ్ చేపడుతున్న ఈ పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు మద్దతు పలకాలని, రేపటి నుండి విద్యాభవన్ ముందు జరిగే నిరవధిక ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు.
డిమాండ్లు నెరవేరే వరకు ఏపీటీఎఫ్ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.