Wednesday, 2 September 2026
  • Home  
  • తుక్కుగూడ నర్సు కుటుంబానికి కేటీఆర్ భరోసా
- రంగారెడ్డి

తుక్కుగూడ నర్సు కుటుంబానికి కేటీఆర్ భరోసా

తుక్కుగూడ నర్సు కుటుంబానికి కేటీఆర్ భరోసా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ.. ఫోన్‌లో పరామర్శ ముల్కలపల్లి: తుక్కుగూడలో దారుణ హత్యాచారానికి గురైన నర్సు కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన బాధిత యువతి కుటుంబ సభ్యులను కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయం అందించి, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తమ వంతు సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు. Uploaded Video:

తుక్కుగూడ నర్సు కుటుంబానికి కేటీఆర్ భరోసా

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ.. ఫోన్‌లో పరామర్శ

ముల్కలపల్లి: తుక్కుగూడలో దారుణ హత్యాచారానికి గురైన నర్సు కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన బాధిత యువతి కుటుంబ సభ్యులను కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు.

కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయం అందించి, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తమ వంతు సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.