Wednesday, 2 September 2026
  • Home  
  • డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను నెల రోజుల్లో పూర్తిగా వసూలు చేయాలి:
- పెద్దపల్లి

డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను నెల రోజుల్లో పూర్తిగా వసూలు చేయాలి:

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, సెప్టెంబర్ 02: డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం పొందాల్సిన బకాయిలను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం పూర్తిస్థాయిలో వసూలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తో కలిసి డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు సంబంధించిన ఆస్తులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సదరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం విలువను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం రికవరీ చేయాలని సూచించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లకు సంబంధించి తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు సమన్వయంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సంబంధిత రైస్ మిల్లర్ల ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో గుర్తించి, బకాయిల రికవరీకి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించి, డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి మొత్తం బకాయి మొత్తాన్ని నెల రోజుల్లోగా పూర్తిగా వసూలు చేయాలని స్పష్టం చేశారు. బకాయిల వసూళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులో చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల ఆస్తుల గుర్తింపు, రికార్డుల పరిశీలన, బకాయిల నిర్ధారణ తదితర అంశాల్లో సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన గడువులో బకాయిల వసూళ్లు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బి. గంగయ్య, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, సెప్టెంబర్ 02:
డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం పొందాల్సిన బకాయిలను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం పూర్తిస్థాయిలో వసూలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తో కలిసి డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు సంబంధించిన ఆస్తులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సదరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం విలువను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం రికవరీ చేయాలని సూచించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లకు సంబంధించి తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు సమన్వయంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సంబంధిత రైస్ మిల్లర్ల ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో గుర్తించి, బకాయిల రికవరీకి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించి, డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి మొత్తం బకాయి మొత్తాన్ని నెల రోజుల్లోగా పూర్తిగా వసూలు చేయాలని స్పష్టం చేశారు. బకాయిల వసూళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులో చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల ఆస్తుల గుర్తింపు, రికార్డుల పరిశీలన, బకాయిల నిర్ధారణ తదితర అంశాల్లో సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన గడువులో బకాయిల వసూళ్లు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బి. గంగయ్య, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.