మూల్యాంకన పద్ధతులు మారినంత మాత్రాన విద్యా ప్రమాణాలు పెరగవు –డి శ్రీనివాస్, టిపీటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
————————————————————–
జనగామ, ఆగష్టు 30,పున్నమి జిల్లా ప్రతినిధి :
*ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి,
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెరగాలంటే బోధన అభ్యసన విధానాలలో మార్పు రావాలి. అంతే కానీ బాహ్య మూల్యాంకనంతో విద్యా ప్రమాణాలు ఏ మాత్రం పెరుగవు. ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు, ప్రతి తరగతి తరగతికి ఒక గది , ఒక ప్రధానోపాధ్యాయుడు, బోధనేతర పనులు చూడడానికి ఒక గుమస్తా , శానిటేషన్ పనుల కోసం ఒక అటెండర్, ఒక స్కావెంజర్ లతో ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తే ప్రాథమిక పాఠశాలలో నమోదు పెరుగుతుంది మరియు విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. ప్రాథమిక స్థాయిలో ఆశించిన విద్యా ప్రమాణాలు సాధిస్తే అవి సెకండరీ మరియు ఉన్నత విద్యలో విద్యా ప్రమాణాలను పెంచుతాయి. ఉపాధ్యాయులను కేవలం బోధనాభ్యసన పనులకు పరిమితం చేస్తే తప్పకుండా విద్యా ప్రమాణాలు మెరుగైతాయి.
ప్రాథమిక , మాధ్యమిక స్థాయిలో బాహ్య మూల్యాంకనం చేయించడం సరైన పద్ధతి కాదు ,ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు అనేక అవస్థలతో కొట్టుమిట్టాడుతున్నాయి, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అనేక ఉన్నాయి. మళ్లీ ఇదొక కొత్త పథకం తీసుకొచ్చి ఉపాధ్యాయులను తరగతి గదికి మరికొన్ని రోజులు దూరం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బాహ్య మూల్యాంకనం విధానాన్ని వెనక్కి తీసుకోవాలని టిపిటిఎఫ్ డిమాండ్ చేస్తుంది.తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున నిర్ణయించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకుండా , పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించడం మూలంగానే విద్యారంగం ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాలల వరకు నష్టం జరుగుతా ఉన్నది, బాహ్య మూల్యాంకనం చేయించడం వల్ల విద్యార్థులకుఎలాంటి ప్రయోజనం ఒనగూరదు.
