నంద్యాల పట్టణంలోని 36వ వార్డు రామకృష్ణ స్కూల్ వద్ద వార్డు ఇంచార్జ్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపాటి నారాయణస్వామి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.స్త్రీ శక్తి పథకంపై మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబ భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఫిరోజ్ తెలిపారు.

36వ వార్డులో ఇంటింటికీ తెలుగుదేశం