Wednesday, 19 August 2026
  • Home  
  • నాగర్ కర్నూల్ :ఆధునిక సాగుతోనే రైతులకు భరోసా: కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ
- నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ :ఆధునిక సాగుతోనే రైతులకు భరోసా: కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ

వరికి ప్రత్యామ్నాయంగా లాభదాయక పంటలు, బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌తో కూరగాయలు, ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం, రైతులను అభినందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,…… తాడూరు, బిజినేపల్లి మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కే. సురేంద్ర మోహన్‌, జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌,ప్రస్తుత ఎల్ నీనో పరిస్థితులలో పంట మార్పిడి లో భాగంగా , వరి మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటల నుండి లాభదాయకమైన కూరగాయలు పామాయిల్ తోటలు పప్పు దినుసులు సాగు చేస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. సంప్రదాయ వరి, మొక్కజొన్న పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన పంటలను సాగు చేస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని సాధిస్తున్న రైతుల పొలాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కే. సురేంద్ర మోహన్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ హేమంత్ కేశవ్‌ పాటీల్‌ పరిశీలించారు. రైతులను అభినందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,…… నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రైతులు బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌ వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్న తీరును రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కే. సురేంద్ర మోహన్‌, జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌ అభినందించారు. రైతులు అనుసరిస్తున్న ఆధునిక యాజమాన్య పద్ధతులు, సాధిస్తున్న దిగుబడులు, పొందుతున్న ఆదాయంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వీడియో కాల్‌ ద్వారా రైతులను నేరుగా మాట్లాడించారు. బిజినేపల్లి, తాడూరు మండలాలకు చెందిన రైతులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా మాట్లాడి, వారు చేపడుతున్న ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలు, బిందు సేద్యం వినియోగం, పంటల దిగుబడి, ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆయిల్‌పామ్‌ వంటి లాభదాయక పంటలను ఎంచుకుని, ఆధునిక సాగు పద్ధతులను పాటిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేలా బిందు సేద్యాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని, రైతులు తమ భూమి, నీటి వనరులు, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా లాభదాయకమైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.రైతులు తమ అనుభవాలను మంత్రితో పంచుకున్నారు. బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌, ప్లాస్టిక్‌ మల్చింగ్‌, అంతర పంటల సాగు, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి పద్ధతుల ద్వారా సాధిస్తున్న ప్రయోజనాలను వివరించారు. రైతులు స్వయంగా అవలంబిస్తున్న ఈ విధానాలు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.జిల్లాలో రైతులు చేపడుతున్న ప్రత్యామ్నాయ, లాభదాయక పంటల సాగును రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా గుర్తించి అభినందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం లభించడం తమకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని రైతులు తెలిపారు.నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పరిధిలోని బిజినేపల్లి, తాడూరు మండలాల్లో పర్యటించిన వారు రైతులు చేపడుతున్న ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌, ప్లాస్టిక్‌ మల్చింగ్‌, స్టేకింగ్‌, ట్రెలీసింగ్‌, అంతర పంటల సాగు, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి పద్ధతులను రైతులు ఏ విధంగా అమలు చేస్తున్నారో అనే విషయాన్ని రైతుల పంట పొలాలను సందర్శించి తెలుసుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నీటి లభ్యత, నేల స్వభావం, స్థానిక వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని వ్యవసాయ తెలంగాణలోనూ వరి ఆధారిత సాగు నుంచి ప్రాంతానుకూల ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని వారు తెలిపారు. బిజినేపల్లి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతు పి. మాధవరెడ్డి మూడు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టారు. ఇందులో ప్రధానంగా టమాటా, వంకాయ, పచ్చిమిర్చి పంటలను సాగు చేస్తున్నారు. పంట సాగులో రైతు ఆధునిక యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ నీటితో పంటకు అవసరమైన తేమను అందించేందుకు బిందు సేద్యంను వినియోగిస్తున్నారు. అదే సమయంలో నీటితో పాటు మొక్కలకు అవసరమైన పోషకాలను సమర్థవంతంగా అందించేందుకు ఫెర్టిగేషన్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. పంట పొలంలో ప్లాస్టిక్‌ మల్చింగ్‌ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీని ద్వారా నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.అలాగే కూరగాయల మొక్కలకు అవసరమైన ఆధారాన్ని కల్పించేందుకు స్టేకింగ్‌, ట్రెలీసింగ్‌ పద్ధతులను పాటిస్తున్నారు. మొక్కల పెరుగుదలను క్రమబద్ధీకరించడం, కాయలు నేలను తాకకుండా చూడటం, పంట నాణ్యతను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు ఈ విధానాల ద్వారా పొందుతున్నట్లు రైతు వివరించారు.మొక్కలను ఒకేసారి కాకుండా క్రమపద్ధతిలో నాటే స్టాగర్డ్‌ ప్లాంటింగ్‌ మెథడాలజీని కూడా రైతు అనుసరిస్తున్నారు. ఆధునిక పద్ధతుల సమన్వయంతో కూరగాయల సాగును నిర్వహిస్తున్న మాధవరెడ్డి పొలాన్ని అధికారులు పరిశీలించి సాగు విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో సూక్ష్మ సేద్యం ద్వారా నీరు, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, కూరగాయలు, పూలు, ఆయిల్‌పామ్‌ వంటి పంటల్లో ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా మైక్రో ఇరిగేషన్‌ కార్యక్రమాలు అమలవుతున్నాయిని సురేంద్రమోహన్ తెలిపారు. తాడూరు మండలం చెర్ల ఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు రాజేందర్‌రెడ్డి 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ తోటను సాగు చేస్తున్నారు. తోట నిర్వహణలో బిందు సేద్యాన్ని వినియోగిస్తూ నీటి వినియోగాన్ని నియంత్రిస్తున్నారు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను సమన్వయం చేస్తూ పంటకు పోషకాలను అందిస్తున్నారు. ముఖ్యంగా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందేందుకు ఆయిల్‌పామ్‌ తోటలో పెసర, మినుము వంటి అంతర పంటలను సాగు చేస్తున్నారు. రాజేందర్‌రెడ్డికి సొంత డెయిరీ ఫార్మ్‌ ఉండటంతో అక్కడ లభించే ఆవుపేడ, ఆవుమూత్రాన్ని కూడా తోటలో వినియోగిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రతి ఆయిల్‌పామ్‌ చెట్టుకు వీటిని అందిస్తున్నట్లు రైతు తెలిపారు. రసాయన ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల తోటలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.రాజేందర్‌రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటలో 33 నెలల వయస్సులోనే ఎకరానికి సుమారు 4.5 టన్నుల దిగుబడి సాధిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎకరానికి సుమారు రూ.లక్ష నికర ఆదాయం పొందుతున్నట్లు వివరించారు. బిజినేపల్లి మండలం జమిస్తాపూర్‌ గ్రామానికి చెందిన రైతు మన్నెపు రెడ్డి పంటల వైవిధ్యీకరణలో భాగంగా భారీ విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ సాగుకు శ్రీకారం చుట్టారు. గతంలో ఆయన ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలను సాగు చేసేవారు. అయితే సంప్రదాయ పంటల సాగుతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించిన అనంతరం ఆయిల్‌పామ్‌ సాగు వైపు మళ్లారు.ఇందులో భాగంగా 25 ఎకరాల విస్తీర్ణంలో 2026 జూలైలో ఆయిల్‌పామ్‌ మొక్కలను నాటారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని పొందాలనే ఉద్దేశంతో పంట మార్పిడిలో భాగంగా ఆయిల్‌పామ్‌ తోటను ఏర్పాటు చేసినట్లు రైతు తెలిపారు. ఆయిల్‌పామ్‌ తోటల ప్రారంభ దశలో అంతర పంటలను సాగు చేసుకోవడం ద్వారా ప్రధాన పంట దిగుబడికి వచ్చే వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని ఉద్యానశాఖ సూచిస్తోంది.ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కే. సురేంద్ర మోహన్‌, జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌ రైతులతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. పంట సాగుకు అయ్యే పెట్టుబడి, నీటి వినియోగం, ఎరువుల వినియోగ విధానం, కూలీల అవసరం, పంట దిగుబడి, మార్కెట్‌ పరిస్థితులు, రైతుకు లభిస్తున్న ఆదాయం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.రైతులు తమకు అనుకూలంగా ఉన్న పంటలను ఎంపిక చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సాగు ఖర్చులను నియంత్రించడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవచ్చని సూచించారు. వెంకటాపూర్‌లో మాధవరెడ్డి కూరగాయల సాగు, చెర్ల ఇటిక్యాలలో రాజేందర్‌రెడ్డి ఆయిల్‌పామ్‌ సాగు, జమిస్తాపూర్‌లో మన్నెపు రెడ్డి చేపట్టిన 25 ఎకరాల ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి సన్మానించారు. వారి వెంట జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారి వెంకటేశం, డివిజన్ ఆర్టికల్చర్ అధికారి జగన్, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు

వరికి ప్రత్యామ్నాయంగా లాభదాయక పంటలు,
బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌తో కూరగాయలు, ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం,
రైతులను అభినందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,……
తాడూరు, బిజినేపల్లి మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కే. సురేంద్ర మోహన్‌, జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌,ప్రస్తుత ఎల్ నీనో పరిస్థితులలో పంట మార్పిడి లో భాగంగా , వరి మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటల నుండి లాభదాయకమైన కూరగాయలు పామాయిల్ తోటలు పప్పు దినుసులు సాగు చేస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. సంప్రదాయ వరి, మొక్కజొన్న పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన పంటలను సాగు చేస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని సాధిస్తున్న రైతుల పొలాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కే. సురేంద్ర మోహన్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ హేమంత్ కేశవ్‌ పాటీల్‌ పరిశీలించారు.
రైతులను అభినందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,……
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రైతులు బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌ వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్న తీరును రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కే. సురేంద్ర మోహన్‌, జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌ అభినందించారు. రైతులు అనుసరిస్తున్న ఆధునిక యాజమాన్య పద్ధతులు, సాధిస్తున్న దిగుబడులు, పొందుతున్న ఆదాయంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వీడియో కాల్‌ ద్వారా రైతులను నేరుగా మాట్లాడించారు. బిజినేపల్లి, తాడూరు మండలాలకు చెందిన రైతులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా మాట్లాడి, వారు చేపడుతున్న ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలు, బిందు సేద్యం వినియోగం, పంటల దిగుబడి, ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆయిల్‌పామ్‌ వంటి లాభదాయక పంటలను ఎంచుకుని, ఆధునిక సాగు పద్ధతులను పాటిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేలా బిందు సేద్యాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని, రైతులు తమ భూమి, నీటి వనరులు, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా లాభదాయకమైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.రైతులు తమ అనుభవాలను మంత్రితో పంచుకున్నారు. బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌, ప్లాస్టిక్‌ మల్చింగ్‌, అంతర పంటల సాగు, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి పద్ధతుల ద్వారా సాధిస్తున్న ప్రయోజనాలను వివరించారు. రైతులు స్వయంగా అవలంబిస్తున్న ఈ విధానాలు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.జిల్లాలో రైతులు చేపడుతున్న ప్రత్యామ్నాయ, లాభదాయక పంటల సాగును రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా గుర్తించి అభినందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం లభించడం తమకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని రైతులు తెలిపారు.నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పరిధిలోని బిజినేపల్లి, తాడూరు మండలాల్లో పర్యటించిన వారు రైతులు చేపడుతున్న ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌, ప్లాస్టిక్‌ మల్చింగ్‌, స్టేకింగ్‌, ట్రెలీసింగ్‌, అంతర పంటల సాగు, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి పద్ధతులను రైతులు ఏ విధంగా అమలు చేస్తున్నారో అనే విషయాన్ని రైతుల పంట పొలాలను సందర్శించి తెలుసుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నీటి లభ్యత, నేల స్వభావం, స్థానిక వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని వ్యవసాయ తెలంగాణలోనూ వరి ఆధారిత సాగు నుంచి ప్రాంతానుకూల ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని వారు తెలిపారు.
బిజినేపల్లి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతు పి. మాధవరెడ్డి మూడు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టారు. ఇందులో ప్రధానంగా టమాటా, వంకాయ, పచ్చిమిర్చి పంటలను సాగు చేస్తున్నారు.
పంట సాగులో రైతు ఆధునిక యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ నీటితో పంటకు అవసరమైన తేమను అందించేందుకు బిందు సేద్యంను వినియోగిస్తున్నారు. అదే సమయంలో నీటితో పాటు మొక్కలకు అవసరమైన పోషకాలను సమర్థవంతంగా అందించేందుకు ఫెర్టిగేషన్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు.
పంట పొలంలో ప్లాస్టిక్‌ మల్చింగ్‌ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీని ద్వారా నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.అలాగే కూరగాయల మొక్కలకు అవసరమైన ఆధారాన్ని కల్పించేందుకు స్టేకింగ్‌, ట్రెలీసింగ్‌ పద్ధతులను పాటిస్తున్నారు. మొక్కల పెరుగుదలను క్రమబద్ధీకరించడం, కాయలు నేలను తాకకుండా చూడటం, పంట నాణ్యతను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు ఈ విధానాల ద్వారా పొందుతున్నట్లు రైతు వివరించారు.మొక్కలను ఒకేసారి కాకుండా క్రమపద్ధతిలో నాటే స్టాగర్డ్‌ ప్లాంటింగ్‌ మెథడాలజీని కూడా రైతు అనుసరిస్తున్నారు. ఆధునిక పద్ధతుల సమన్వయంతో కూరగాయల సాగును నిర్వహిస్తున్న మాధవరెడ్డి పొలాన్ని అధికారులు పరిశీలించి సాగు విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో సూక్ష్మ సేద్యం ద్వారా నీరు, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, కూరగాయలు, పూలు, ఆయిల్‌పామ్‌ వంటి పంటల్లో ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా మైక్రో ఇరిగేషన్‌ కార్యక్రమాలు అమలవుతున్నాయిని సురేంద్రమోహన్ తెలిపారు.
తాడూరు మండలం చెర్ల ఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు రాజేందర్‌రెడ్డి 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ తోటను సాగు చేస్తున్నారు. తోట నిర్వహణలో బిందు సేద్యాన్ని వినియోగిస్తూ నీటి వినియోగాన్ని నియంత్రిస్తున్నారు.
రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను సమన్వయం చేస్తూ పంటకు పోషకాలను అందిస్తున్నారు. ముఖ్యంగా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందేందుకు ఆయిల్‌పామ్‌ తోటలో పెసర, మినుము వంటి అంతర పంటలను సాగు చేస్తున్నారు.
రాజేందర్‌రెడ్డికి సొంత డెయిరీ ఫార్మ్‌ ఉండటంతో అక్కడ లభించే ఆవుపేడ, ఆవుమూత్రాన్ని కూడా తోటలో వినియోగిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రతి ఆయిల్‌పామ్‌ చెట్టుకు వీటిని అందిస్తున్నట్లు రైతు తెలిపారు.
రసాయన ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల తోటలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.రాజేందర్‌రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటలో 33 నెలల వయస్సులోనే ఎకరానికి సుమారు 4.5 టన్నుల దిగుబడి సాధిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎకరానికి సుమారు రూ.లక్ష నికర ఆదాయం పొందుతున్నట్లు వివరించారు.
బిజినేపల్లి మండలం జమిస్తాపూర్‌ గ్రామానికి చెందిన రైతు మన్నెపు రెడ్డి పంటల వైవిధ్యీకరణలో భాగంగా భారీ విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ సాగుకు శ్రీకారం చుట్టారు.
గతంలో ఆయన ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలను సాగు చేసేవారు. అయితే సంప్రదాయ పంటల సాగుతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించిన అనంతరం ఆయిల్‌పామ్‌ సాగు వైపు మళ్లారు.ఇందులో భాగంగా 25 ఎకరాల విస్తీర్ణంలో 2026 జూలైలో ఆయిల్‌పామ్‌ మొక్కలను నాటారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని పొందాలనే ఉద్దేశంతో పంట మార్పిడిలో భాగంగా ఆయిల్‌పామ్‌ తోటను ఏర్పాటు చేసినట్లు రైతు తెలిపారు.
ఆయిల్‌పామ్‌ తోటల ప్రారంభ దశలో అంతర పంటలను సాగు చేసుకోవడం ద్వారా ప్రధాన పంట దిగుబడికి వచ్చే వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని ఉద్యానశాఖ సూచిస్తోంది.ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కే. సురేంద్ర మోహన్‌, జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌ రైతులతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.
పంట సాగుకు అయ్యే పెట్టుబడి, నీటి వినియోగం, ఎరువుల వినియోగ విధానం, కూలీల అవసరం, పంట దిగుబడి, మార్కెట్‌ పరిస్థితులు, రైతుకు లభిస్తున్న ఆదాయం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.రైతులు తమకు అనుకూలంగా ఉన్న పంటలను ఎంపిక చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సాగు ఖర్చులను నియంత్రించడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవచ్చని సూచించారు.
వెంకటాపూర్‌లో మాధవరెడ్డి కూరగాయల సాగు, చెర్ల ఇటిక్యాలలో రాజేందర్‌రెడ్డి ఆయిల్‌పామ్‌ సాగు, జమిస్తాపూర్‌లో మన్నెపు రెడ్డి చేపట్టిన 25 ఎకరాల ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.
వారి వెంట జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారి వెంకటేశం, డివిజన్ ఆర్టికల్చర్ అధికారి జగన్, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.