Saturday, 3 October 2026

Tag: Krishna mandal

నారాయణపేట

డిగ్రీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవాలి బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప

కృష్ణ మండలం: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన డిగ్రీ పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ కృష్ణ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప కోరారు. 2023 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత పూర్తి చేసిన వారు, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా ఈ నెల 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ మెమో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ జిరాక్స్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సమర్పించి, గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ అనంతరం సంబంధిత పత్రాలను మండల తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న పట్టభద్రులు, స్వయం ఉపాధి పొందుతున్న విద్యావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు దండు రాఘవేంద్ర, సచిన్ బట్, బీజేవైఎం మండల అధ్యక్షులు ఓట్టేవొళ్ల సురేష్, అజిత్ దీక్షిత్ పాల్గొన్నారు.

నారాయణపేట

కున్సిలో బోలాశంకర వినాయకునికి ప్రత్యేక పూజలు

కున్సి: కృష్ణ మండలం కున్సి గ్రామంలోని శ్రీ బోలాశంకర వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహేష్ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్లె నర్సప్ప మాట్లాడుతూ వినాయక నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో శివరాజ్ సార్, కమిటీ సభ్యులు నల్లె సైబన్న, జనార్ధన్ గౌడ్, సబుగౌడ్, ఈ.రాజు, పి.ప్రభు, గౌడప్ప తాత, యు.బస్వరాజు, అలిగేరి నగనుషన్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

ఖాన్ దొడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కృష్ణ మండలం ఖాన్ దొడ్డి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయప్ప గౌడ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు షేక్ సర్ఫరాజ్, గ్రామ సర్పంచ్ సంగోల వెంకటేష్, ఉపసర్పంచ్ దుకాణం శ్రీనివాస్, జీపీఓ గీత, రేషన్ కార్డు డీలర్ సుగప్ప, వార్డు సభ్యులు వెంకటేష్, మల్లప్ప, నర్సప్ప, ఆనంద్, ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొత్తగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు సులభతరంగా, అర్థవంతంగా ఉండటంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

నారాయణపేట

రూ.173.83 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం సీతక్కకు స్వాగతం పలికేందుకు కున్సీ కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

కృష్ణ మండలం కున్సీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మక్తల్‌కు బయలుదేరారు. మక్తల్ నియోజకవర్గంలో రూ.173 కోట్ల 83 లక్షల నిధులతో బీటీ రోడ్లు, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు విచ్చేస్తున్న పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దాసరి సీతక్కకు స్వాగతం పలికేందుకు వారు తరలివెళ్లారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదిగి వెంకటేష్ గౌడ్, అలిగేరి గంగప్ప, మాదేవ్, గడ్డమీద శరణ్, బుర్ర గంగప్ప, జుట్ల దేవప్ప, బాడెల్ అశోక్, కారంపూడి మల్లప్ప, గాదం లక్ష్మణ్, జుట్ల శివప్ప, సోమకోల నాగేందర్, కాందొడ్డి నారాయణ, పుండుకూరు రామచందర్, ఎన్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కున్సీ గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా మక్తల్‌కు బయలుదేరి మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు. జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్.. జై శ్రీహరి అన్న అంటూ నినాదాలు చేశారు.

నారాయణపేట

కున్సిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా బుధవారం కున్సి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మేకలి సురేష్, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పరి రమేష్, జీపీఓ గీత, బీజేపీ మండల అధ్యక్షుడు నల్లే నరసప్ప, కాంగ్రెస్ నాయకులు నల్లే శ్రీనివాస్, తంగిడి సుదర్శన్, సుగప్ప, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

నారాయణపేట

ఉప్పరి తిరుపతికి హిందూపూర్ బీజేవైఎం అధ్యక్ష పదవి

కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో బీజేవైఎం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మండల బీజేవైఎం అధ్యక్షులు వొట్టేవోళ్ళ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉప్పారి తిరుపతిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బి. శివకుమార్, కే. బస్వరాజు, ప్రధాన కార్యదర్శిగా డి. రమేష్, కార్యదర్శిగా సి. సచిన్, కోశాధికారిగా యూ. మహాంతేష్‌ను ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా మండల బీజేపీ అధ్యక్షులు నల్లె నర్సప్ప పాల్గొని, యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా సుమారు 20 మంది యువకులు బీజేపీలో చేరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.