Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

రూ.173.83 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం సీతక్కకు స్వాగతం పలికేందుకు కున్సీ కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.173.83 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం సీతక్కకు స్వాగతం పలికేందుకు కున్సీ కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

కృష్ణ మండలం కున్సీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మక్తల్‌కు బయలుదేరారు. మక్తల్ నియోజకవర్గంలో రూ.173 కోట్ల 83 లక్షల నిధులతో బీటీ రోడ్లు, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు విచ్చేస్తున్న పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దాసరి సీతక్కకు స్వాగతం పలికేందుకు వారు తరలివెళ్లారు.
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదిగి వెంకటేష్ గౌడ్, అలిగేరి గంగప్ప, మాదేవ్, గడ్డమీద శరణ్, బుర్ర గంగప్ప, జుట్ల దేవప్ప, బాడెల్ అశోక్, కారంపూడి మల్లప్ప, గాదం లక్ష్మణ్, జుట్ల శివప్ప, సోమకోల నాగేందర్, కాందొడ్డి నారాయణ, పుండుకూరు రామచందర్, ఎన్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కున్సీ గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా మక్తల్‌కు బయలుదేరి మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు. జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్.. జై శ్రీహరి అన్న అంటూ నినాదాలు చేశారు.

రూ.173.83 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం సీతక్కకు స్వాగతం పలికేందుకు కున్సీ కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *