పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి, నిల్వచేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న కాజా రామారావు @ జయంతి రామారావుపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలానికి చెందిన రామారావు రేషన్ డీలర్లు, ఏజెంట్ల ద్వారా లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలను దుర్వినియోగం చేసి బియ్యం సేకరించినట్లు పేర్కొన్నారు. కల్లూరు, తల్లాడ, ఎర్రుపాలెం, చంద్రుగొండ పోలీస్ స్టేషన్లలో 2026 ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకు ఐదు కేసులు నమోదయ్యాయి. 2024లోనూ తల్లాడ, కల్లూరులో మరో రెండు కేసులున్నాయి. సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం బుధవారం రామారావును అదుపులోకి తీసుకుని చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.



