పున్నమి ప్రతినిధి జులై 24: నాగర్ కర్నూల్ జిల్లాకు నూతనంగా వచ్చిన అదనపు కలెక్టర్ చెన్నయ్య గారిని నాగర్ కర్నూల్ జిల్లా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బావాండ్ల వెంకటేష్ కార్యదర్శి షర్ఫుద్దీన్ కార్యాలయంలో శాలువలతోఘనంగా సన్మానించారు.జిల్లా ప్రజలకు పెరుగైన సేవలు అందించుటలో ఉద్యోగులు తోడ్పాటు కావాలని వారు కోరారు.ఈకార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బావండ్ల వెంకటేష్,కార్యదర్శి షర్ఫుద్దీన్,ఉపాధ్యక్షులు చెన్నకేశవులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,నాగర్ కర్నూల్ యూనిట్ అధ్యక్షులు నసిరుద్దీన్,కార్యదర్శి సురేష్ కుమార్,మహిళా నాయకులు అలివేలు,అరుణ,మరియు రామకృష్ణ, సుదర్శన్, బుగ్గప్ప,నాగయ్య,రాకేష్ కన్నా, తదితరులు పాల్గొన్నారు.




