సీతారామపురం: మండలంలోని ఘాట్ రోడ్డులో ఆదివారం రాత్రి బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గమనించి వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. మృతుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన మోటార్ బైక్ నంబర్ ప్లేట్ ప్రకాశం జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీతారామపురం ఘాట్ రోడ్డులో బైక్ ప్రమాదం.. వ్యక్తి మృతి