ఉదయగిరి: పట్టణంలోని మద్యం దుకాణాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ బి. దీప్తి కారంత్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో మద్యం సీసాలు, విక్రయ రికార్డులను పరిశీలించారు. దుకాణాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను అధికారులు తనిఖీ చేశారు. ఎవరైనా అక్రమంగా బెల్ట్ దుకాణాలు నిర్వహించినా, మద్యం ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయించినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

ఉదయగిరి మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు