Wednesday, 27 May 2026
  • Home  
  • కొండబిట్రగుంట ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
- News

కొండబిట్రగుంట ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన

కొండబిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ మంగళవారం సందర్శించారు. ఆలయాల్లో ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా తీర్చిదిద్దేందుకు సీఎం నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. క్షేత్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, మెట్ల మార్గంలో తూర్పు వైపు రైలింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈవో రాధాకృష్ణకు సూచించారు. అలాగే ప్రైవేటు సంస్థల ప్రకటనల బోర్డులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా సహాయ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్మాల్యాద్రి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కొండబిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ మంగళవారం సందర్శించారు. ఆలయాల్లో ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా తీర్చిదిద్దేందుకు సీఎం నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. క్షేత్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, మెట్ల మార్గంలో తూర్పు వైపు రైలింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈవో రాధాకృష్ణకు సూచించారు. అలాగే ప్రైవేటు సంస్థల ప్రకటనల బోర్డులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా సహాయ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్మాల్యాద్రి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.