నెల్లూరులోని బాలసదన్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘న్యాయ విజ్ఞాన సదస్సు’ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మరియు సంస్థ కార్యదర్శి పద్మశ్రీ మాట్లాడుతూ, విద్యార్థినులు తమకున్న చట్టాలు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు, మహిళలకు ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు లేదా సహాయం అవసరమైనా టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ హేనాసుజన్, బాలసదన్ సూపరింటెండెంట్ దుర్గాదేవి తదితరులు పాల్గొని విద్యార్థుల సేవలపై ఆరా తీశారు.

విద్యార్థినులకు న్యాయ విజ్ఞాన సదస్సు