–
– .
జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి ప్రతినిధి)
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో నెల్లూరు నగరంలో జరుగుతున్న అవకతవకలు, ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల జోక్యం, ప్రభుత్వ యంత్రాంగం తీరు, పెన్నా నది లో ఇసుక అక్రమ దోపిడీ పై నేను మరియు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వాస్తవాలను సాక్షాలతో సహా ప్రజల ముందు ఉంచాం.అయితే, ఆ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పాల్సిన బాధ్యాతాయుత హాదా లో ఉన్న మంత్రి నారాయణ ఎప్పటిలాగే ఎదురుదాడి రాజకీయాన్ని ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ లోని ఒక నాయకుడితో ప్రెస్‌మీట్ పెట్టించి మమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టించారు. ప్రజలు అడుగుతున్న అసలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధ్యతాయుతమైన రాజకీయాలకు నిదర్శనం అని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుండగా. ఆ తేదీ నాటికి ఎన్యుమరేషన్ ఫారాలు బి ఎల్ ఓ ల ద్వారా అప్లోడ్ కాకపొతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో ఆ ఓటర్లు ఉండరు అని అధికారులే చెబుతున్నారు. అంటే ఆ ఓట్లు తొలగించ బడినట్లు కాదా..? దీనిపై మంత్రి స్పష్టమైన సమాధానం చెప్పాలన్నారు.
ఓటర్ల అప్ లోడ్ పై ఆదివారం రోజున కమిషనర్ కి ఫోన్ చేసి ప్రభుత్వ బి ఎల్ ఓ లు ఎన్యుమరేషన్ ఫారాలను టీడీపీ బి ఎల్ ఏ లకు ఇచ్చేస్తున్నారని తెలుపగా. అందుకు ఆయన మీ బి ఎల్ ఏ లకు కూడా ఫారమ్స్ ఇస్తామని చెప్పారు. అయితే అదే రోజు కమిషనర్ విడుదల చేసిన డేటాలో 99 శాతం ఫారాలు ఓటర్లకు అందించినట్లుగా అబద్దపు జాబితాని విడుదల చేశారని. అలాంటప్పుడు ఇక ఎన్యూమరేషన్ ఫారం లు అన్నీ టీడీపీ వారికి ఇచ్చేసిన తరువాత మాకు ఏమి ఇస్తారు? ఎవరివి ఇస్తారు… అని కమిషనర్ ని అడిగాను. దీనిద్వారా మమ్మల్ని, ప్రజలని మోసం చేయడం కనిపించడం లేదా ?అదే అధికారిక డేటా లో కేవలం 40 శాతం ( ఆదివారం రోజుకి ) ఓటర్లు మాత్రమే అప్లోడ్ అయినట్లు ఉంది . 99 శాతం ఫారాలు ఓటర్ల కి పంపిణీ చేసినప్పుడు, అప్లోడ్ ఎందుకు 40 శాతం మాత్రమే జరిగింది? మిగిలిన ఫారాలు తెలుగుదేశం పార్టీ బి ఎల్ ఏ ల దగ్గర హోల్డ్ అయి ఉన్నాయి అని ఆయనను అడిగాను. ఇది ఆదివారం జరిగగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా 5 రోజుల తరువాత ( శుక్రవారం ) ప్రెస్ మీట్లో 70% అప్లోడ్ అయ్యాయి అదికూడా తెలియదా అని మాట్లాడించి సమస్యని దారి మళ్లించడం సరికాదన్నారు.. రామ్మూర్తి నగర్లో
ఒకే డోర్ నంబర్‌పై 28 ఓట్లు ఉన్నాయని నాయకుడితో చెప్పించారని. ఒకవేళ ఇది నిజం అయితే ఆ నాయకుడు గత ప్రభుత్వంలో కూడా మున్సిపాలిటీలో కీలక బాధ్యతలు నిర్వహించారని. ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరిగాయా? జరిగి ఉంటే అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి మంత్రి నారాయణ సమాధానం చెప్పాలని కోరారు..
రాజకీయ అనుభవం అంటే ఏమిటో మంత్రి నారాయణ ప్రజలకు వివరించాలని,
ప్రజలను మోసం చేయడమా? అబద్ధాలు చెప్పడమా? అన్యాయం చేయడమా? బెదిరింపులా? రౌడీయిజమా? బూతులు తిట్టడమా? అసాంఘిక కార్యకలాపాలు చేయడమా? చూసుకుందాం రా అని మీసం తిప్పడమా? ఎందులో అనుభవం కావాలో చెప్పాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు.
. 47వ డివిజన్లోని మా వైఎస్ఆర్ సి పి, బి ఎల్ ఏ లపై విమర్శలు చేయించారని, ప్రభుత్వ బి ఎల్ ఓ లు రాజకీయ పార్టీ టెంట్ లలో కూర్చోవడం తప్పు అన్నది మా ప్రశ్న అని అన్నారు.
238వ బూత్‌కు సంబంధించిన సూపర్వైజర్ సందీప్ (ఫోన్ నెంబర్ 7382044846) మంగళవారం రోజున నాకు ఫోన్ చేసి ప్రభుత్వ బి ఎల్ ఓ వద్ద 240 ఎన్యుమరేషన్ ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మా పార్టీ బి ఎల్ ఓ ని ఆయన దగ్గరకి పంపమని అడిగారు .
అదే సమయంలో మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన అధికారిక డేటాలో కేవలం నాలుగు ఫారాలు మాత్రమే ఆ బూత్ లో పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వైరుధ్యంపై నేను ఆ ప్రభుత్వ అధికారినే ప్రశ్నించాను. ఇలా మమ్మల్ని, ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని అడిగాను. ఇదీ వాస్తవం. దీనికి సమాధానం చెప్పకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యంగా చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.
ఉపాధ్యాయ ఓటర్లు తక్కువ మంది అని హేళనగా మాట్లాడిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
చివరిగా, వాస్తవాలను ప్రశ్నించిన ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలు చేయించడం, వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకోవడం మంత్రి నారాయణకి తగదని. ప్రజలు ఇప్పుడు ప్రచారాన్ని కాదు, నిజాలను కోరుతున్నారు. మేము లేవనెత్తిన ప్రతి అంశానికి వాస్తవాధారాలతో సమాధానం చెప్పాలని మంత్రి నారాయణ ని మరోసారి కోరుతున్నట్లు

