Monday, 10 August 2026

జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటనలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో పాల్గొననున్న మంత్రి ఆత్మకూరు , జూలై 24 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల 27 నుంచి ఆగస్టు 1 వరకు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయం వెల్లడించింది. జూలై 27న ఆత్మకూరు మున్సిపాలిటీ మొదటి వార్డు ముస్తాపురం ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని, సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లను ప్రారంభిస్తారు. అనంతరం రచ్చబండ వద్ద మీడియా సమావేశంలో పాల్గొంటారు. జూలై 28న అనంతసాగరం మండలం సోమశిలలో సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, మాతమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం పాతాళపల్లిలో రూ.36 లక్షల ఎఫ్‌డీఆర్ నిధులతో చేపట్టనున్న సాగునీటి పనులకు భూమిపూజ నిర్వహించి, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. జూలై 29న నెల్లూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించే నెల్లూరు పార్లమెంట్ స్థాయి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరవుతారు. ఆగస్టు 1న మర్రిపాడు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, సోలార్ ప్యానెల్స్ ప్రారంభోత్సవం, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్, సీసీ రోడ్లు, కస్తూర్బా పాఠశాల భవనం, ల్యాబ్‌ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం విద్యార్థినులతో సామూహిక భోజనం చేసి, జూనియర్ కళాశాలలో జరిగే సమావేశానికి హాజరవుతారు. మంత్రి పర్యటనలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలను మంత్రి క్యాంపు కార్యాలయం కోరింది.

జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటనలు

అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో పాల్గొననున్న మంత్రి

ఆత్మకూరు , జూలై 24 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల 27 నుంచి ఆగస్టు 1 వరకు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయం వెల్లడించింది.

జూలై 27న ఆత్మకూరు మున్సిపాలిటీ మొదటి వార్డు ముస్తాపురం ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని, సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లను ప్రారంభిస్తారు. అనంతరం రచ్చబండ వద్ద మీడియా సమావేశంలో పాల్గొంటారు.

జూలై 28న అనంతసాగరం మండలం సోమశిలలో సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, మాతమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం పాతాళపల్లిలో రూ.36 లక్షల ఎఫ్‌డీఆర్ నిధులతో చేపట్టనున్న సాగునీటి పనులకు భూమిపూజ నిర్వహించి, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

జూలై 29న నెల్లూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించే నెల్లూరు పార్లమెంట్ స్థాయి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరవుతారు.

ఆగస్టు 1న మర్రిపాడు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, సోలార్ ప్యానెల్స్ ప్రారంభోత్సవం, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్, సీసీ రోడ్లు, కస్తూర్బా పాఠశాల భవనం, ల్యాబ్‌ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం విద్యార్థినులతో సామూహిక భోజనం చేసి, జూనియర్ కళాశాలలో జరిగే సమావేశానికి హాజరవుతారు.

మంత్రి పర్యటనలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలను మంత్రి క్యాంపు కార్యాలయం కోరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.