Wednesday, 9 September 2026
  • Home  
  • చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..పెదకోటలో టీడీపీ శ్రేణుల కాగడాల రోడ్‌షో
- అల్లూరి సీతారామరాజు

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..పెదకోటలో టీడీపీ శ్రేణుల కాగడాల రోడ్‌షో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2023లో అరెస్టైన ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాగడాల రోడ్‌షో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొని కాగడాలు చేతబట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జే దేవుడు మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ 9న అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చీకటి రోజుగా మిగిలిపోయిందని అన్నారు. ఆ ఘటన జరిగి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి పరిణామాలను, అనంతరం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ టీడీపీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారని, ప్రస్తుతం మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంతో పాటు ప్రవాసాంధ్రులు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పెదకోటలో నిర్వహించిన కాగడాల రోడ్‌షోలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. కార్యక్రమం సందర్భంగా కాగడాలతో రోడ్డుపై ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ ఏన్. సింహాచలం, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి కే. గణేష్, గ్రామ కమిటీ తెలుగు రైతు అధ్యక్షులు ఎస్. ఈశ్వరరావు, వాటర్‌షెడ్ చైర్మన్ కే. కృష్ణమూర్తి, టీడీపీ సీనియర్ యువ నాయకుడు జి. దేవరాజు, వాటర్‌షెడ్ కోశాధికారి పిదారప్ప తదితరులతో పాటు మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2023లో అరెస్టైన ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాగడాల రోడ్‌షో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొని కాగడాలు చేతబట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా మాజీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జే దేవుడు మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ 9న అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చీకటి రోజుగా మిగిలిపోయిందని అన్నారు. ఆ ఘటన జరిగి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి పరిణామాలను, అనంతరం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ టీడీపీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారని, ప్రస్తుతం మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంతో పాటు ప్రవాసాంధ్రులు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

పెదకోటలో నిర్వహించిన కాగడాల రోడ్‌షోలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. కార్యక్రమం సందర్భంగా కాగడాలతో రోడ్డుపై ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ ఏన్. సింహాచలం, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి కే. గణేష్, గ్రామ కమిటీ తెలుగు రైతు అధ్యక్షులు ఎస్. ఈశ్వరరావు, వాటర్‌షెడ్ చైర్మన్ కే. కృష్ణమూర్తి, టీడీపీ సీనియర్ యువ నాయకుడు జి. దేవరాజు, వాటర్‌షెడ్ కోశాధికారి పిదారప్ప తదితరులతో పాటు మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.