అనకాపల్లిలో ఘనంగా సంచార జాతుల విముక్త దివాస్ “స్ఫూర్తి”
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
అనకాపల్లి డా. రావు గోపాల్ రావు కళాకేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంచార జాతుల విముక్త దివాస్ “స్ఫూర్తి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సంచార, విముక్త జాతుల ఆత్మగౌరవం, సంక్షేమం, సాధికారతపై నాయకులు అవగాహన కల్పించారు.
బ్రిటిష్ పాలనలో అన్యాయానికి గురై, తరతరాలుగా వివక్షను ఎదుర్కొన్న సంచార, విముక్త జాతుల గౌరవం, అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. “సంక్షేమం మాత్రమే కాదు.. సాధికారతే లక్ష్యం” అనే స్ఫూర్తితో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మండల బీజేపీ అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి, నగిరెడ్డి శ్రీనుబాబు, పనసపల్లి రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.


