Friday, 4 September 2026
  • Home  
  • అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సంస్థ సహాయ హస్తం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సంస్థ సహాయ హస్తం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన తాళ్లరేవులో సంత మార్కెట్ ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సర్వస్వం కోల్పోయిన బాధితులకు రెడ్ క్రాస్ సంస్థ సహాయ హస్తం అందించింది. రెడ్ క్రాస్ సంస్థ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాద బాధితులైన బొత్స లక్ష్మి,పోతాబత్తుల కనకరత్నం,వళ్లు సత్యనారాయణ కుటుంబాలకు వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు కోరుకొండ నారాయణ ( ఢిల్లీ నారాయణ ), తహసిల్దార్ గొల్లపల్లి వీరభద్రరావు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు,తాళ్లరేవు జడ్పిటిసి సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, రెడ్ క్రాస్ సంస్థ తాళ్లరేవు మండల అధ్యక్షులు వై రత్నప్రసాద్, వీఆర్వో పోలవరపు వీరబాబు, మాజీ ఎంపీటీసీ లు బొంతు వీర మోహన్, మేడిశెట్టి సత్యనారాయణ , తెలుగుదేశం పార్టీ తాళ్లరేవు గ్రామ అధ్యక్షులు కుడుపూడి దుర్గాప్రసాద్, పులపకూర జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.