Tuesday, 18 August 2026
  • Home  
  • రేగుపాలం–ఎలమంచిలి రహదారికి మరమ్మతుల శ్రీకారం
- అనకాపల్లి

రేగుపాలం–ఎలమంచిలి రహదారికి మరమ్మతుల శ్రీకారం

యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): రేగుపాలం ఎన్‌హెచ్‌–5 నుంచి ఎలమంచిలి కోటారి వారి పెట్రోల్ బంక్ వరకు గుంతలతో అధ్వానంగా మారిన రహదారికి ఎట్టకేలకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్యాచ్‌వర్క్ ద్వారా గుంతలను పూడ్చి తారు వేస్తున్నారు. గతంలో ఈ రహదారిపై గుంతల కారణంగా పలుమార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించింది. సమస్యను ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు పనులు చేపట్టారు. ఏఈ సత్యవాణి పనులను పర్యవేక్షించగా, లైన్ కొత్తూరు పంచాయతీ జనసేన నాయకులు లాలం సోమునాయుడు, ఇతర జనసేన, కూటమి నాయకులు పనులను పరిశీలించారు. రహదారి మరమ్మతులకు చొరవ చూపిన ఎమ్మెల్యే, అధికారులకు, నాయకులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
రేగుపాలం ఎన్‌హెచ్‌–5 నుంచి ఎలమంచిలి కోటారి వారి పెట్రోల్ బంక్ వరకు గుంతలతో అధ్వానంగా మారిన రహదారికి ఎట్టకేలకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్యాచ్‌వర్క్ ద్వారా గుంతలను పూడ్చి తారు వేస్తున్నారు.
గతంలో ఈ రహదారిపై గుంతల కారణంగా పలుమార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించింది. సమస్యను ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు పనులు చేపట్టారు.
ఏఈ సత్యవాణి పనులను పర్యవేక్షించగా, లైన్ కొత్తూరు పంచాయతీ జనసేన నాయకులు లాలం సోమునాయుడు, ఇతర జనసేన, కూటమి నాయకులు పనులను పరిశీలించారు. రహదారి మరమ్మతులకు చొరవ చూపిన ఎమ్మెల్యే, అధికారులకు, నాయకులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.