ఇటీవల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం నుండి విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు మీడియా ప్రతినిధులు ప్రవేశించకుండా జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్ళరేవు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్. కుల వివేక్షత వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు విప్పర్తి శ్రీనివాసరావు, కన్నీరు వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల సంక్షేమ వసంతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు సమస్యలను తెలుసుకోవడానికి ఎస్సీ ఎస్టీ సంఘాలకు, విద్యార్థి సంఘాలు విలేకరులకు వెళ్లే అవకాశం ఉండదని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని భావించి ఈ జీవో ని విడుదల చేశారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు మరియు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే హక్కును కల్పించిందన్నారు. సంక్షేమ వసతి గృహాలలోకి విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు మరియు మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని నిషేధించడం రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.
అందువల్ల ఈ సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేసి, సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తాళ్లరేవులో గతంలో మూడు సంక్షేమ హాస్టళ్ళు ఉండేవని, కానీ నేడు ఒక్క హాస్టలు కూడా లేదన్నారు. దీనితో పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున తాళ్లరేవులో సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లతో రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వినకోటి రామకృష్ణ,నల్లి ఈశ్వరరావు, అదృష్టధీపుడు, పులపాకూర గోపాలకృష్ణ, అంబటి లక్ష్మీ, దుర్గ ప్రసాద్,అంబటి దేవి, రాంబాబు, తాళ్లూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సర్కులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి
ఇటీవల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం నుండి విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు మీడియా ప్రతినిధులు ప్రవేశించకుండా జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్ళరేవు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్. కుల వివేక్షత వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు విప్పర్తి శ్రీనివాసరావు, కన్నీరు వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల సంక్షేమ వసంతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు సమస్యలను తెలుసుకోవడానికి ఎస్సీ ఎస్టీ సంఘాలకు, విద్యార్థి సంఘాలు విలేకరులకు వెళ్లే అవకాశం ఉండదని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని భావించి ఈ జీవో ని విడుదల చేశారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు మరియు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే హక్కును కల్పించిందన్నారు. సంక్షేమ వసతి గృహాలలోకి విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు మరియు మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని నిషేధించడం రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. అందువల్ల ఈ సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేసి, సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తాళ్లరేవులో గతంలో మూడు సంక్షేమ హాస్టళ్ళు ఉండేవని, కానీ నేడు ఒక్క హాస్టలు కూడా లేదన్నారు. దీనితో పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున తాళ్లరేవులో సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లతో రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వినకోటి రామకృష్ణ,నల్లి ఈశ్వరరావు, అదృష్టధీపుడు, పులపాకూర గోపాలకృష్ణ, అంబటి లక్ష్మీ, దుర్గ ప్రసాద్,అంబటి దేవి, రాంబాబు, తాళ్లూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

