Tuesday, 18 August 2026
  • Home  
  • రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు.. ముఖ్య అతిథులుగా హాజరైన సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన, టిడిపి ఇన్చార్జ్ చమర్తి, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి
- అన్నమయ్య

రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు.. ముఖ్య అతిథులుగా హాజరైన సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన, టిడిపి ఇన్చార్జ్ చమర్తి, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి

ఏపీయూడబ్ల్యూజే సేవలు చిరస్మరణీయం.. రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు.. ముఖ్య అతిథులుగా హాజరైన సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన, టిడిపి ఇన్చార్జ్ చమర్తి, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రాజంపేట: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) పనిచేస్తుందని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన ఐఏఎస్, రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి శ్రీనివాసరాజు అన్నారు. సోమవారం రాజంపేట పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, తాలూకా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన ఐఏఎస్, టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ముందుగా సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన రిబ్బన్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 17న జర్నలిస్టులు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, భావప్రకటన స్వేచ్ఛ, వృత్తి భద్రత, మీడియా రంగంలో పనిచేస్తున్న శ్రమజీవుల సంక్షేమం కోసం యూనియన్ చేస్తున్న కృషికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం, పాలనలో లోపాలను ఎత్తి చూపడం, సమాజంలో జరుగుతున్న పరిణామాలను వాస్తవాల ఆధారంగా ప్రజల ముందుంచడం వంటి బాధ్యతలను జర్నలిస్టులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ క్రమంలో వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు జర్నలిస్టులకు అండగా నిలవడం, వారి హక్కుల కోసం పోరాడడం ఏపీయూడబ్ల్యూజే ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా నిలుస్తోందన్నారు.పాత్రికేయులకు వృత్తి భద్రత, గుర్తింపు, సంక్షేమ పథకాల అమలు, ఆరోగ్య మరియు సామాజిక భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో పాటు, జర్నలిస్టులపై ఒత్తిళ్లు వచ్చినప్పుడు సంఘటితంగా స్పందించాల్సిన అవసరాన్ని యూనియన్ చాటి చెబుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన పాత్రికేయతకు ఎంతో ప్రాధాన్యత ఉందని,ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు, వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడం, భిన్నాభి ప్రాయాలను ప్రజల ముందుంచడం వంటి అంశాల్లో భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడం అత్యంత కీలకమన్నారు. ఈ విలువలను పరిరక్షించేందుకు జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం గుర్తుచేస్తోందన్నారు.ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు సమావేశాలు, సేవా కార్యక్రమాలు, చర్చా వేదికలు నిర్వహిస్తూ యూనియన్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఐక్యంగా పనిచేస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో పాత్రికేయుల పాత్రను మరింత బలోపేతం చేయాలనే సంకల్పం కోసం యూనియన్ పనిచేస్తుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన పాత్రికేయులను, యువతను సబ్ కలెక్టర్ తో పాటు ప్రజా ప్రతినిధులు అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో ఎంఎస్ఎస్ వెల్ఫేర్ అండ్ హెల్త్ కేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మొగల్ షోయాబ్, ట్రస్ట్ సిబ్బంది వివేక్, చైతన్య, రాజేష్,గణేష్ రక్తదానం చేసిన వారికి జ్యూస్ ప్యాకెట్లు, పండ్లు, త్రాగు నీటిని అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన, టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి శ్రీనివాసరాజు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ కేజియా, ఎం ఎస్ ఎస్ వెల్ఫేర్ అండ్ హెల్త్ కేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మొగల్ షోయాబ్ ను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఘనంగా శాలవాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా ప్రధాన కార్యదర్శి శివశంకర్, కోశాధికారి కార్తీక్, ఉపాధ్యక్షులు రవిచంద్ర ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు దార్ల శ్రీనివాస్ ఆచారి, త్రివిక్రమ్, కమిటీ సభ్యులు ఓబులేసు, కళ్యాణ్,పేయ్యల శివ, శ్రీహరి,మందా శివయ్య, నాగేంద్ర ప్రసాద్, సునీల్, రాయలు, దివాకర్, సీనియర్ పాత్రికేయులు, అలీ షేర్, ప్రవీణ్ కుమార్, సాయికుమార్, సురేంద్ర, ప్రశాంత్, ఇబ్బు, దుర్గయ్య, నరసింహులు, సుధాకర్, వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు, రవీంద్ర, లక్ష్మీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఏపీయూడబ్ల్యూజే సేవలు చిరస్మరణీయం..
రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు..

ముఖ్య అతిథులుగా హాజరైన సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన, టిడిపి ఇన్చార్జ్ చమర్తి, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి
పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు

రాజంపేట: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) పనిచేస్తుందని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన ఐఏఎస్, రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి శ్రీనివాసరాజు అన్నారు. సోమవారం రాజంపేట పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, తాలూకా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన ఐఏఎస్, టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ముందుగా సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన రిబ్బన్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 17న జర్నలిస్టులు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, భావప్రకటన స్వేచ్ఛ, వృత్తి భద్రత, మీడియా రంగంలో పనిచేస్తున్న శ్రమజీవుల సంక్షేమం కోసం యూనియన్ చేస్తున్న కృషికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం, పాలనలో లోపాలను ఎత్తి చూపడం, సమాజంలో జరుగుతున్న పరిణామాలను వాస్తవాల ఆధారంగా ప్రజల ముందుంచడం వంటి బాధ్యతలను జర్నలిస్టులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ క్రమంలో వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు జర్నలిస్టులకు అండగా నిలవడం, వారి హక్కుల కోసం పోరాడడం ఏపీయూడబ్ల్యూజే ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా నిలుస్తోందన్నారు.పాత్రికేయులకు వృత్తి భద్రత, గుర్తింపు, సంక్షేమ పథకాల అమలు, ఆరోగ్య మరియు సామాజిక భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో పాటు, జర్నలిస్టులపై ఒత్తిళ్లు వచ్చినప్పుడు సంఘటితంగా స్పందించాల్సిన అవసరాన్ని యూనియన్ చాటి చెబుతోందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన పాత్రికేయతకు ఎంతో ప్రాధాన్యత ఉందని,ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు, వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడం, భిన్నాభి ప్రాయాలను ప్రజల ముందుంచడం వంటి అంశాల్లో భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడం అత్యంత కీలకమన్నారు. ఈ విలువలను పరిరక్షించేందుకు జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం గుర్తుచేస్తోందన్నారు.ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు సమావేశాలు, సేవా కార్యక్రమాలు, చర్చా వేదికలు నిర్వహిస్తూ యూనియన్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఐక్యంగా పనిచేస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో పాత్రికేయుల పాత్రను మరింత బలోపేతం చేయాలనే సంకల్పం కోసం యూనియన్ పనిచేస్తుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన పాత్రికేయులను, యువతను సబ్ కలెక్టర్ తో పాటు ప్రజా ప్రతినిధులు అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో ఎంఎస్ఎస్ వెల్ఫేర్ అండ్ హెల్త్ కేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మొగల్ షోయాబ్, ట్రస్ట్ సిబ్బంది వివేక్, చైతన్య, రాజేష్,గణేష్ రక్తదానం చేసిన వారికి జ్యూస్ ప్యాకెట్లు, పండ్లు, త్రాగు నీటిని అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన, టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరి శ్రీనివాసరాజు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ కేజియా, ఎం ఎస్ ఎస్ వెల్ఫేర్ అండ్ హెల్త్ కేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మొగల్ షోయాబ్ ను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఘనంగా శాలవాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా ప్రధాన కార్యదర్శి శివశంకర్, కోశాధికారి కార్తీక్, ఉపాధ్యక్షులు రవిచంద్ర ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు దార్ల శ్రీనివాస్ ఆచారి, త్రివిక్రమ్, కమిటీ సభ్యులు ఓబులేసు, కళ్యాణ్,పేయ్యల శివ, శ్రీహరి,మందా శివయ్య, నాగేంద్ర ప్రసాద్, సునీల్, రాయలు, దివాకర్, సీనియర్ పాత్రికేయులు, అలీ షేర్, ప్రవీణ్ కుమార్, సాయికుమార్, సురేంద్ర, ప్రశాంత్, ఇబ్బు, దుర్గయ్య, నరసింహులు, సుధాకర్, వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు, రవీంద్ర, లక్ష్మీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.