Wednesday, 19 August 2026
  • Home  
  • విద్యా వైభవాన్ని చాటిన శకటం.. ద్వితీయ బహుమతి కైవసం!
- విశాఖపట్నం

విద్యా వైభవాన్ని చాటిన శకటం.. ద్వితీయ బహుమతి కైవసం!

విశాఖ జిల్లా విద్యాశాఖకు ఘన గౌరవం – రూపకల్పనలో ప్రతిభ కనబరిచిన జగన్ మోహన్‌కు సన్మానం విశాఖపట్నం: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విశాఖపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా విద్యాశాఖ తన ప్రతిభను చాటుకుంది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విశాఖ జిల్లా విద్యాశాఖ రూపొందించిన శకటానికి ద్వితీయ బహుమతి లభించింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, విద్యా ప్రగతి కార్యక్రమాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో శకటం ద్వారా ఆకట్టుకునేలా ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. శకట రూపకల్పనతో పాటు సమన్వయంలో సమగ్ర శిక్షా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ జగన్ మోహన్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్‌కుమార్ జగన్ మోహన్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజలకు చేరువ చేసేలా శకటాన్ని తీర్చిదిద్దడంలో ఆయన చూపిన ప్రతిభ ప్రశంసనీయమని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖకు లభించిన ఈ బహుమతి విద్యాశాఖ అధికారులు, సిబ్బందిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా సిబ్బంది పాల్గొని జగన్ మోహన్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విద్యా ప్రగతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన శకటం.. విశాఖ విద్యాశాఖకు మరో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.

విశాఖ జిల్లా విద్యాశాఖకు ఘన గౌరవం – రూపకల్పనలో ప్రతిభ కనబరిచిన జగన్ మోహన్‌కు సన్మానం

విశాఖపట్నం: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విశాఖపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా విద్యాశాఖ తన ప్రతిభను చాటుకుంది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విశాఖ జిల్లా విద్యాశాఖ రూపొందించిన శకటానికి ద్వితీయ బహుమతి లభించింది.
విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, విద్యా ప్రగతి కార్యక్రమాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో శకటం ద్వారా ఆకట్టుకునేలా ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. శకట రూపకల్పనతో పాటు సమన్వయంలో సమగ్ర శిక్షా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ జగన్ మోహన్ కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్‌కుమార్ జగన్ మోహన్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజలకు చేరువ చేసేలా శకటాన్ని తీర్చిదిద్దడంలో ఆయన చూపిన ప్రతిభ ప్రశంసనీయమని పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖకు లభించిన ఈ బహుమతి విద్యాశాఖ అధికారులు, సిబ్బందిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా సిబ్బంది పాల్గొని జగన్ మోహన్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
విద్యా ప్రగతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన శకటం.. విశాఖ విద్యాశాఖకు మరో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.