గత మూడు రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దవాగు పూర్తిగా నిండిపోయి, చెక్‌డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. ప్రవహిస్తున్న నీటి అందాలు స్థానికులతో పాటు పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ వర్షాలతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరగడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి లభ్యత మెరుగుపడి పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని, ఈ సీజన్‌లో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు ప్రకృతికి పునర్జీవం పోసి వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయని స్థానికులు పేర్కొన్నారు.




