Friday, 21 August 2026
  • Home  
  • వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో ఘనంగా కిసాన్ మేళా…!
- అనకాపల్లి

వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో ఘనంగా కిసాన్ మేళా…!

యలమంచిలి | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలి గ్రామంలో రాపేటి శ్రీను కల్లాల వద్ద ఆత్మ సౌజన్యంతో కిసాన్ మేళా నిర్వహించారు. నాలుగు మండలాలకు చెందిన అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, కందులు, జనుము, ఉలవలు వంటి తక్కువ నీటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఏడీఏ శ్రీధర్ రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. రైతులు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

యలమంచిలి | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్

యలమంచిలి గ్రామంలో రాపేటి శ్రీను కల్లాల వద్ద ఆత్మ సౌజన్యంతో కిసాన్ మేళా నిర్వహించారు. నాలుగు మండలాలకు చెందిన అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, కందులు, జనుము, ఉలవలు వంటి తక్కువ నీటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఏడీఏ శ్రీధర్ రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
రైతులు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.