Friday, 21 August 2026
  • Home  
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయవంతంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్
- వరంగల్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయవంతంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా SFI రాష్ట్ర సహాయకార్యదర్శి మంద శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పైసా గణేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU) పేరుతో తీసుకువస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ITI–ATCలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని అన్నారు. పాలిటెక్నిక్ విద్య అనేది ప్రత్యేకమైన సాంకేతిక విద్యా వ్యవస్థ అని, దాని ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా డిప్లమా కోర్సులను ఇతర శిక్షణా కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే SFI ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, SFI జిల్లా కమిటీ సభ్యులు జశ్వంత్, చెన్నూరి సాయికుమార్ ,మణిదీప్,పవన్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్, వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడు వసీమ్, SFI నాయకులు పసునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా SFI రాష్ట్ర సహాయకార్యదర్శి మంద శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పైసా గణేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU) పేరుతో తీసుకువస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ITI–ATCలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని అన్నారు.
పాలిటెక్నిక్ విద్య అనేది ప్రత్యేకమైన సాంకేతిక విద్యా వ్యవస్థ అని, దాని ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా డిప్లమా కోర్సులను ఇతర శిక్షణా కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే SFI ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, SFI జిల్లా కమిటీ సభ్యులు జశ్వంత్, చెన్నూరి సాయికుమార్ ,మణిదీప్,పవన్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్, వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడు వసీమ్, SFI నాయకులు పసునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.