యలమంచిలి | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి గ్రామంలో రాపేటి శ్రీను కల్లాల వద్ద ఆత్మ సౌజన్యంతో కిసాన్ మేళా నిర్వహించారు. నాలుగు మండలాలకు చెందిన అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, కందులు, జనుము, ఉలవలు వంటి తక్కువ నీటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఏడీఏ శ్రీధర్ రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
రైతులు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.


