APSPDCL పరిధిలోని 9 జిల్లాల పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం జరుగుతుందని సంస్థ CMD శివశంకర్ తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, బిల్లింగ్ సమస్యలు, సోలార్ నెట్ మీటరింగ్, ఓపెన్ యాక్సెస్, విద్యుత్ భద్రత తదితర అంశాలపై వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. సమస్యలపై సత్వర చర్యలు తీసుకునేలా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్