జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
– ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఫోన్ చేసి, సందేశాలు పంపి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
గౌరవనీయులైన ప్రధానమంత్రి narendramodi గారు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు ద్వారక నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞుడిని.
జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, ప్రతి జన సైనికుడు, వీర మహిళ, అభిమానులు నా పుట్టినరోజును ఎంతో ప్రేమతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. మీతో ఉన్న ఈ అనుబంధం నాకు ఎంతో విలువైనది.
మీరు అందించిన శుభాకాంక్షలను నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాను. అదే సమయంలో, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను.
మీరు చూపే అభిమానం నాకు మరింత బాధ్యతగా పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ గౌరవిస్తూ, నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించేందుకు ఇది నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది.
ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ నాకు గొప్ప బలంగా నిలుస్తాయి.


