సత్తుపల్లి/ఖమ్మం
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కల్పతరు రోడ్లో సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గురువారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
మార్నింగ్ వాక్ సందర్భంగా ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దృష్టికి తీసుకురాగా, ఆమె వాటిని శ్రద్ధగా విని, సంబంధిత శాఖల అధికారులకు వివరించారు. సమస్యలను తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ చైర్మన్ రెహనా కమల్ పాషా, టౌన్ అధ్యక్షులు గాదె చెన్నారావు, 16వ వార్డు కౌన్సిలర్ జోన్నలగడ్డ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు విరివాడ అపర్ణ, ఉప్పు నాగమణి, దూదిపాళ్ల రాంబాబు, జగన్నాదం శ్రీను, కాంగ్రెస్ నాయకులు బొంతు వేణు, చల్లగుళ్ల కృష్ణయ్య, కమల్ పాషాతో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



